అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు భారత్ పేరు నేరుగా తీసి హెచ్చరికలు చేయలేదు. కానీ ఇప్పుడా పనిని కూడా పూర్తి చేశాడు. అమెరికన్ల తర్వాతే ఎవరైనా అంటున్న ట్రంప్.. భారత్‌పై టారీఫ్‌ల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేశాడు. చైనా, బ్రెజిల్‌తో పాటు భారత్‌పై కూడా టారీఫ్‌లు విధిస్తామని తేల్చేశారు ట్రంప్.
మోదీ కి పెద్ద సవాలే..
ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. నిజానికి ఈ పర్యటన చాలా కీలకమైనదనే చెప్పాలి. ఇప్పటికే తాను చెప్పిందే వేదం.. చేసిందే రైటు అనే తీరుగా వెళ్తున్న ట్రంప్‌ను కాస్త కట్టడి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న భారత అక్రమ వలసదారుల విషయంలో ఆయన ఆచితూచి స్పందిస్తున్నారనే చెప్పాలి. ఇతర లాటిన్ అమెరికాలోని దేశలపై విరుచుకపడ్డట్టుగా విరుచుకపడటం లేదు. అయితే ఆయన ఎంతకాలం ఇలా సంయమనం పాటిస్తారనేది చూడాలి. లెక్కల ప్రకారం అమెరికాలో 6 వేలకు పైగా మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఇక వాణిజ్యానికి సంబంధించి కూడా ట్రంప్ దుందుడుకు చర్యలు తీసుకుంటే భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే విదేశాంగ విధాన విషయంలో భారత్ ఇప్పటి వరకు ఎక్కడా తగ్గడం లేదు. కన్నుకు కన్ను.. పన్నుకు పన్ను అన్నట్టుగా ముందుకు వెళుతుంది. మరి ఇప్పుడు అమెరికా విషయంలో కూడా అదే విధంగా రియాక్ట్ అవుతారా? లేక వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తారా? అనేది చూడాలి.
అమెరికాలో పన్నులు రద్దు చేస్తారా?
అమెరికన్లపై పన్నులు తగ్గించడం లేదా రద్దు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు ట్రంప్. విదేశాల కోసం అమెరికన్లపై భారం మోపడం ఎందుకు అనేది ఆయన ప్రశ్న. నిజానికి పన్నుల రూపంలో ప్రస్తుతం అమెరికాకు భారీగానే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం తగ్గిపోతే దానిని విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారీఫ్‌లు పెంచి వసూలు చేయాలన్నది ట్రంప్ ఆలోచన.
ట్రంప్ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే.. ?
ఈ ప్రశ్నకు సమాధానం రీసెంట్‌గా కెనడా ఇచ్చింది. టారీఫ్‌లు పెంచితే తాము కాస్త నష్టపోతాం కానీ.. అంతకంటే ఎక్కువ నష్టం అమెరికన్లకే అనేది కెనడా వాదన. టారీఫ్‌లకు అనుగుణంగా ధరలు కూడా పెరుగుతాయని.. దీని వల్ల ఎక్కువగా చెల్లించి కొనాల్సింది అమెరికన్లే కదా అంటోంది అమెరికా. టారీఫ్‌లు పెంచడం వల్ల తమకు ఎంత నష్టం ఉంటుందో.. అమెరికన్లకు కూడా అంతే నష్టమని చెబుతున్నారు. మరి కెనడా బాటలోనే ప్రపంచ దేశాలన్ని నడిస్తే అమెరికన్లకు కాస్త కష్టమనే చెప్పాలి.