- అల్లర్లకు కారకులైన వారిని శిక్షించండి
హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ డిమాండ్
త్రిపుర, బెంగాల్ హైకమిషనర్ల ను వెనక్కి పిలిచిన బంగ్లాదేశ్
మీడియా నిజాలు రాయాలంటూ యూనస్ సుద్దులు
బంగ్లా దేశ్ లో హిందువులపైవరుస దాడులు జరగడం పట్ల హిందూ సంఘాల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందూ సమ్మిళిత జాగరణ సమితి ప్రతినిధి చిన్మయ్ అరెస్టు తర్వాత ఈనెల 3నుంచి ఆ దేశంలో అల్లర్లు, నిరసనలు ఉథ్రుత మవుతున్నాయి.తమకు భద్రత లేకుండా పోతోందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అల్లర్లకు, హింసకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ హిందూ , బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ బంగ్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశంలొకే అతిపెద్దదయిన ఈ మైనారిటీల రక్షణ సంస్జ సునాం గంజ్ జిల్లాలో హిందువులపై జరిగిన, జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈనెల 3న గునిగాం జిల్లాలోని హిందువులు అధికంగా ఉండే మంగల్ గావ్, మోనీగావ్ ఏరియాల్లో దాడులు ఎక్కువగా జరిగాయని దాదాపు వంద ఇళ్లను, షాపులను ధ్వంసం చేశారని, ఒక హిందూ ఆలయంపై దాడులు చేశారని ఈసంస్థ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. దాదాపుపదిలక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపింది.ప్రజలంతా ప్రాణ భయంతో ఇళ్లు వదిలి పారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆకాశ్ దాస్ అనే 20 ఏళ్లహిందూ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టుపై ఆందోళనాకారులు స్పందించి ఈ దారుణాలకు తెగబడ్డారు. ఆ పోస్ట్ పెట్టిన దాస్ ను అల్లర్లు జరగడానికి ముందే అరెస్టు చేశారు. అయినా విధ్వంసం చేయాలన్నదే ధ్యేయంగా అల్లరి మూకలు చెలరేగుతున్నాయి.
మరొవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మనదేశంలో ఉన్న వాళ్ల దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించింది.బెంగాల్, త్రిపురలోని బంగ్లాదేశ్ హైకమిషనర్లు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.. ఈరెండు ఎంబసీల దగ్గర హిందూ సంస్థలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో యూనస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్రిపురలోని అగర్తలలో ఆందోళనాకారులు ఎంబసీలోకి చొరబడి వెళ్లడం అక్కడ బంగ్లాదేశ్ పతాకంతో పాటు కొన్ని వస్తువులు ధ్వంసం చేయడంతో బంగ్లా ప్రభుత్వం తమ వారిని వెనక్కు రప్పించుకుంటోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేశారని యూనప్ ప్రభుత్వం మనదేశాన్ని విమర్శిస్తోంది. హిందువుల ఆరోపణలన్నీ వాస్తవ దూరమని, ఇంత జరిగితే అంత చెపుతున్నారని, మీడియా నిస్పక్ష పాతంగా రాయాలని యూనస్ అంటున్నారు. దేశంలో అందరి మనోభావాలను, సెంటిమెంట్లను గౌరవిస్తామని మొక్కుబడి ప్రకటన చేస్తున్నారు.
హసీనా గద్దె దిగిన తర్వాతే…
షేక్ హసీనాను గద్దె దింపిన నాటినుంచి ఈ అల్లర్లు పెరిగిపోయాయి. హిందువులకు అక్కడ భద్రత లేకుండా పోతోంది.అక్రమంగా అదుపులోకి తీసుకున్న చిన్మయ్ క్రిష్ణ దాస్ ను నేటికీ వదిలిపెట్టలేదు. బంగ్లా దేశ్లో హిందువులపై దాడులపై భారత్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.కొల్ కాతాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి.క్రిష్ణ దాస్ ను వదిలిపెట్టాలంటూ భారత్ చేసిన విన్నపాలను కూడా బంగ్లా దేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.