గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్ళు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈసీఎల్ లో జరుగుతున్న మారథాన్ రన్ లో పాల్గొనడానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ వద్ద గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుళ్ళు ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. మృతిల్లో ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పరంధాములుగా మరొకరు దౌల్తాబాద్ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇరువురి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున దర్యాప్తు చేస్తున్నారు.