డిపార్ట్ మెంట్ వాహనంలోనే బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలను ఆదివారం ఉదయం జమ్మూకాశ్మీర్ లో కనుగొన్నారు. ఆదివాం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పరిధిలోని రెహంబల్ సమీపంలో ఆగిఉన్న ఒక జేకే పోలీస్ వ్యాన్ లో ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో చనిపోయి పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అనుమాస్పద స్ధితిలో జరిగిన ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ పోలీసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాశ్మీర్ లోయలో విధినిర్వహణలో ఉన్న పోలీసుల భద్రతపై ఈ సంఘటన పలు అనుమానాలను లేవనెత్తింది.