36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఏపీ సీయస్ కు ఎన్.హెచ్.ఆర్.సీ సమన్లు

ఏపీలో 3వేల మంది బాలికలు మిస్సింగ్ పై సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యం అయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. ఏపీలో మూడు వేల మంది బాలికల మిస్సింగ్ పై ఓ సామాజిక కార్యకర్త గత జనవరి మాసంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సమన్లు జారీ చేసింది. తక్షణం బాలికల అదృశ్యంపై పూర్తి స్ధాయి నివేదిక పంపాలని ఎన్హెచ్ఆర్సీ సీఎస్ ను ఆదేశించింది. ఈ అంశంపై ఎన్ని సార్లు రిమైండర్లు పంపినా ప్రభుత్వం స్పందిచకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.2025 జనవరి 20వ తేదీ లోపల పూర్తి సమాచారంతో, అన్ని డాక్యుమెంట్లతో కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com