గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం ఓ వీడియో ద్వారా చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసినవారంతా ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఎందుకంటే గాజాను అమెరికా డెవలప్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించారు ఆ వీడియోలో.
2025లో గాజా ఇలా ఉంది.. కానీ అమెరికా డెవలప్ చేసిన తర్వాత గాజా వీధుల్లో ట్రంప్ బంగారు విగ్రహాలు ఉంటాయని.. అక్కడి వీధుల్లో టెస్లా కార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిలియనీర్ ఎలాన్ మస్క్ బీచ్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఐటమ్స్‌ను లాగిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో కలిసి ట్రంప్ బీచ్‌లో చిల్ అవుతున్నారు. గాజా వీధుల్లో ట్రంప్ బంగారు విగ్రహాలు అమ్ముతున్నారు. పబ్‌ల్లో అమ్మాయిలతో డ్యాన్స్‌లు చేస్తున్న ట్రంప్.. డాలర్లు వెదజల్లుతున్న మస్క్.. ఇలా అనేక విశేషాలు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో.
ఇప్పుడీ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది. మరి నిజంగా ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుంటారా? చెప్పినట్టుగా అభివృద్ధి చేస్తారా? అనేది తేలాలంటే ఇంకా చాలా సమయమే పడుతుంది కానీ.. అప్పటి వరకు దీనిపై చర్చించుకునేందుకు మాత్రం ఓ వీడియో సరిపోతుందనే చెప్పాలి. అసలు ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుంటామని చేసిన ప్రకటనే పెద్ద దుమారమే రేపింది. ప్రపంచవ్యాప్తంగగా అనేక విమర్శలు కూడా వచ్చాయి. కానీ ట్రంప్ మాత్రం తమ అడుగు ముందుకే అనే సందేశాన్ని ఇచ్చారు ఈ వీడియోతో.