23.8 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఇబ్రహీం జద్రాన్ సెన్సెషనల్ ఇన్నింగ్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పరుగుల వరద పారించాడు ఇబ్రహీం జద్రాన్. అఫ్ఘాన్‌, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇబ్రహీం ఇంగ్లీష్‌ బౌలర్లపై దండయాత్ర చేశాడు. 146 బంతుల్లో ఏకంగా 177 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది వీర విహారం చేశాడు. దీంతో అఫ్ఘాన్‌ ఏకంగా 325 పరుగులు చేసింది.

ఓ వైపు ఒక్కొక్కరుగా నిష్ర్రమిస్తున్నా ఇబ్రహీం మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. నిజానికి ఇదే ఓ రికార్డ్. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు ఇబ్రహీం. అంతకుముందు వన్డే వరల్డ్ కప్‌లో కూడా సెంచరీ చేసిన తొలి అఫ్ఘాన్ బ్యాటర్‌గా కూడా నిలిచాడు ఇబ్రహీం. జద్రాన్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై కూడా వీరవిహారం చేశాడు. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్‌ 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక వన్డేల్లో అతడికి ఇది ఆరో సెంచరీ.

జద్రాన్‌ ఇన్నింగ్స్ సెన్సేషనల్ అని చెప్పాలి. ఎందుకంటే 9 ఓవర్ల సమయానికి అఫ్ఘాన్ స్కోర్ 37. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఇబ్రహీం మాత్రం ఆచితూచి ఆడాడు. మెల్లిమెల్లిగా స్కోర్‌ బోర్డును పరుగు పెట్టించాడు. హష్మతుల్లా కూడా మంచి పార్ట్‌నర్ షిప్‌ ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. స్కోర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే 150 పరుగులు కూడా దాటేశాడు. ఆ తర్వాత 177 పరుగులు చేసి ఔటయ్యాడు. జద్రాన్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com