33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ – 40యేళ్ల తర్వాత రొటీన్‌కు భిన్నంగా ప్రమాణ స్వీకారం

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం చూస్తే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే భారత కాలమానం ప్రకారం చూస్తే.. రాత్రి పదిన్నర గంటలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. యూఎస్‌ కేపిటల్‌ బిల్డింగ్‌లోపల ఈ ప్రమాణస్వీకారోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రపంచదేశాలనుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అయితే, ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలిరోజే 10 ఆర్డర్లపై సంతకాలు చేయనున్నారు. తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తొలిరోజు ఒకే ఆర్డర్‌పై డోనాల్డ్ ట్రంప్‌ సంతకం చేశారు. కానీ, ఈసారి మాత్రం ఏకంగా 10 ఆర్డర్లపై సంతకాలు చేయబోతున్నారు.

యూఎస్ క్యాపిటల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్‌తో యునైటెడ్ స్టేట్స్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్స్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అమెరికా సంప్రదాయం ప్రకారం క్యాపిటల్ బిల్డింగ్ వెలుపల ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా వాషింగ్టన్ డీసీలో వాతావరణం అత్యంత చలిగా ఉంది. దీంతో, ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలను బిల్డింగ్ లోపలికి మార్చారు. అవుట్‌డోర్‌ కాకుండా.. ఇన్‌డోర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ తొలి ప్రసంగం చేయనున్నారు. అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవ సంప్రదాయం ప్రకారం వాస్తవానికి వైట్ హౌస్ వరకు మిలటరీ, స్కూల్ బ్యాండ్స్, అమెరికా పౌరులతో పరేడ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో క్యాపిటల్ వన్ ఎరేనాలోనే పరేడ్ పరిమితం చేస్తున్నారు. అయితే, గతంలో ఉన్న సంప్రదాయాలను బ్రేక్ చేయబోతున్నారు డోనాల్డ్‌ ట్రంప్‌. తన ప్రమాణ స్వీకారోత్సవానికి తొలిసారి డోనాల్డ్ ట్రంప్‌.. పలు దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులను ఆహ్వానించారు. అయితే, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మాత్రమే హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ అడ్వయిజర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు పలువురు బిలియనీర్లు, సెలబ్రిటీలు ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com