వైట్ హౌస్ లోకి ఇంకా అడుగు పెట్టకుండానే అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్ద్ ట్రంప్ తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. గాజా మిలిటెంట్లకు బలమైన వార్నింగ్ ఇచ్చారు. తాను పగ్గాలు చేపట్టడానికి ముందే హమాస్ తీవ్రవాదులు గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి, ఇజ్రాయెల్‌లో జరుగుతున్నయుద్దం ఆపడానికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సుదీర్ఘకాలం పాటు నెరపిన దౌత్యం ఫలించక పోవడంతో ట్రంప్ తన స్వరం పెంచారు.
జనవరి 20,2025 న తాను అమెరికా పగ్గాలు స్వీకరిస్తానని ఈలోగా హమాస్ తీవ్రవాదులు దారికి రాకపోతే మధ్యప్రాచ్య దేశాలు నరకం చూడాల్సి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ సంక్షోభ పరిష్కారానికి 14 నెలలనుంచి బైడెన్ ప్రభుత్వం దౌత్యపరమైన మంతనాలు జరుపుతోంది. కానీ అవేమీ ఫలించడంలేదు. గాజాలో బందీలను విడిపించకపోతే అందుకు కారకులైన వారిని ఇప్పటి వరకూ ఎవరూ చూడనంత భీకర స్థాయిలో ఎదుర్కొంటామన్నారు ట్రంప్. ఇజ్రాయెల్‌కు సంపూర్ణ స్థాయిలో మద్దతు ప్రకటించిన ట్రంప్ బైడన్ ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టిపెట్టలేదని, అప్పుడప్పుడు హమాస్‌పై విమర్శలతో సరిపెట్టిందని అభిప్రాయపడ్డారు.ప్రపంచ స్థాయిలో కలిసొచ్చే అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకునే దిశగా ట్రంప్ అడుగులు వేయనున్నారు.
హమాస్ తీవ్రవాదులకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఏడాది కాలంగా బందీలు :
- Advertisement with us -