నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దీని ప్రభావం కేరళ రాష్ట్రం పైన కూడా పడుతుంది. కేరళ రాష్ట్రంలోనూ శనివారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పతనం తిట్ట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో శబరిమలకు వెళుతున్న అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పంబ, సన్నిధానంలో ఉదయం నుండి కుండపోతగా పడుతున్న వర్షాలతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటుండగా…మరోవైపు అయ్యప్ప స్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పొటెత్తారు.