28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

చేప పిల్లల పంపిణీలో అవకతవకలు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారని గంగపుత్ర సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు.

జగిత్యాల జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారి చెరువులు కుంటలలో నాసిరకం చేప పిల్లలు వేస్తుండగా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో చేప పిల్లల పంపిణీ జరగాలి కానీ అందుకు సీడ్ నాణ్యత ఆరోగ్యపరి స్థితిని మత్స్యశాఖ అధికారులు పరీక్షించి పంపిణీ చేయాలి. రెండు సైజ్ లలో ఉన్న మూడు నుంచి నాలుగు రకాల చాప పిల్లలను చెరువులు కుంటలలో వదలాల్సి ఉంటుంది.

సదరు కాంట్రాక్టర్ కేవలం ఒకే రకం చాప పిల్లలని తక్కువ నాణ్యత ఉన్న వాటిని పోయడం జరుగుతోందని అంటున్నారు. కేవలం పెద్ద సైజ్ చాప పిల్లలు 3 నుండి 3.5 అంగుళాలు సైజ్ చిన్నరకం చేపలు 1.5 అంగుళం సైజ్ ఉండాలి. కాంట్రాక్టర్ మాత్రం ఒకే రకమైన చేపలు అలాగే నాసిరకం పోయడం జరుగుతున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పంపిణీ చేసిన చేప పిల్లలు సగమే కాగా.. ఆ సగంలో కూడా సగానికి పైగా చేపపిల్లలు చేతికి వచ్చేలా లేవని మత్స్య కారులు వాపోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com