మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో హరీష్‌రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హరీష్‌రావుతో పాటు.. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపైనా చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్‌గౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు.. తన సెల్‌ఫోన్ కూడా ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.