– పెళ్లికి తొందర అందుకేనా?
స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు మూడు ముళ్ళబంధంలోకి అడుగు పెడుతోంది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ఈనెల 22న వివాహం జరగనుంది. ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ గా దత్తసాయి పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చాలా కాలంనుంచి పరిచయాలు ఉన్నా..నెల్లాళ్ల క్రితమే వీరి పెళ్లి బంధం ఫిక్స్ అయ్యింది. జనవరి నుంచి సింధుకు వరుస టోర్నమెంట్లు ఉన్నాయి. దాంతో ఈ నెల్లోనే 22న ముహూర్తం బాగుండటంతో రెండు కుటుంబాలు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేసాయి. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో వీళ్ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. వివాహం తర్వాత 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది.పెళ్లికి రెండు రోజుల ముందే అంటే ఈ నెల 20 నుంచే పెళ్లి వేడుకలు మొదలవుతాయి.
టెక్నాలజీ అంటే పిచ్చి..
దత్త సాయికి టెక్నాలజీ అంటే పిచ్చి ప్రేమ.. అత్యంత ఆసక్తి.. ఆ ఆసక్తే ఆయన్ను మల్టీ టాలెంటెడ్‌గా మలిచింది. ఫౌండేషన్ ఫర్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో సాయి బాచిలర్స్ డిగ్రీ చేశారు. 2018లో ఫ్లేమ్ యూనివర్సిటీనుంచి ఎకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బీబీఏ కంప్లీట్ చేశారు. అనంతరం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ నుంచి డాటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సు చేశారు. అంతకుముందు JSW సంస్థకు ఇన్‌హౌస్ కన్సల్టెంట్ గాను,సమ్మర్ ఇన్‌టెర్న్‌గానూ పనిచేసిన అనుభవం కూడా ఆయనసొంతం. JSW సంస్జ ఢిల్లీ కేపిటల్స్ ఐపీఎల్ టీమ్‌ను కొన్నప్పుడు ఆ టీమ్ మేనేజర్‌గా ఆయన పనిచేశారు. ఐపీఎల్ టీమ్ మేనేజర్ బాధ్యత కొత్తదే అయినా తాను చాలా నేర్చుకున్నానని బీబీఏ కోర్సు తనకు ఉపయోగపడిందని అంటారు దత్తసాయి.
అనేక సంస్థలకు పని చేసిన అనుభం..
సోర్ యాపిల్ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ సంస్జకు మేనేజింగ్ డైరక్టర్‌గాకూడా వ్యవహరించారు. బ్యాంకుల నుంచి క్షణాల్లో క్రెడిట్ కార్డులు, లోన్లు పొందే టెక్నికల్ మెకానిజం, ఇన్‌స్టంట్ క్రెడిట్ స్కోర్ మ్యాచింగ్ లాంటి వ్యవస్థలు, మెకానిజం రూపొందించడంలో ఆయనకు అనుభవం ఎక్కువ. సహజంగా ఐటీ టెక్నాలజీ పట్ల ఇష్టం, ఆసక్తి ఉండటంతో ఏకకాలంలో రెండు, మూడు సంస్జల విభాగాలకు ఆయన కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద సంస్షలకు ఇలాంటి అంశాలకు సంబంధించిన సమస్యలకు సులభంగా సొల్యూషన్స్ చూపించడంలో దిట్ట. HDFC, ICICI లాంటి పెద్దపెద్ద బ్యాంకులకు ఆన్‌లైన్ ఆపరేషన్స్‌లో తలెత్తే సమస్యల పరిష్కారంలోనూ ఆయనకు పట్టు ఉంది. 2019 నుంచి ఆయన పోసిడెక్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పోసిడెక్స్ సంస్థలో మార్కెటింగ్, హెచ్ ఆర్ విభాగాలతోపాటు సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్నర్‌షిప్‌ల బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు. అత్యధిక క్వాలిఫికేషన్స్, అనుభవం కలిగి తెలివైన వాడు కావడంతోనే సింధు తండ్రి పీ.వీ. రమణ సింధుకు ఈ పెళ్లి నిశ్చయించారు. కుటుంబపరంగా పరిచయాలు ఉన్న కారణంగా సింధూ, దత్తసాయి గతంలో కొన్ని సినిమాలకు, మ్యాచ్‌లకు కలసి అటెండ్ అయ్యారు కూడా. దత్త సాయి తండ్రి వెంకటేశ్వరరావుకుటుంబంతో సింధు కుటుంబానికి ఉన్న పరిచయాలు, స్నేహబంధాలే ఈ జంట కలసి అడుగులు వేసేందుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయ షట్లర్ సింధుకు దత్తసాయిపెర్‌ఫక్ట్ మ్యాచింగ్ అని సింధు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.