27 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

టారిఫ్‌ వార్ 2.0

– యూరోపియన్ యూనియన్‌కూ ఇచ్చి పడేస్తా..
– ఈసారి ఈయూ దేశాలపై ట్రంప్‌ ఎఫెక్ట్
– తొందరలో ఈయూపై టారిఫ్‌ బాదుడు
– అమెరికన్స్ ప్రయోజనాలే ఫస్ట్ అన్న పెద్దన్న
– దక్షిణాఫ్రికాకు నిధుల కోత
– చూస్తూ ఊరుకోబోమన్న ఈయూ

అమెరికాలో పగ్గాలు చేపట్టగానే ప్రపంచదేశాలపై జులుం ప్రదర్శిస్తున్న డోనాల్డ్ ట్రంప్‌ అమెరికన్స్ ఫస్ట్.. మేక్‌ అమెరికా గ్రేట్‌ అంటూ ఏకపక్షంగా సుంకాలు విధిస్తూ హడలెత్తిస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలేది లేదు ఈసారి టారిఫ్‌ల దెబ్బ ఈయూ దేశాలకే అని తేల్చి చెప్పారు. దానికి ముహూర్తం ఎప్పుడన్నది స్పష్టం చేయకపోయినా.. తొందరలోనే యూరోపియన్ యూనియన్ దేశాలకు వడ్డింపు తప్పదని హింట్‌ ఇచ్చారు. తమ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. యూరోపియన్ యూనియన్‌కూ టారిఫ్‌లు తప్పవు. ఎప్పుడన్నది తొందరలోనే ప్రకటిస్తా.. అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ ట్రేడ్‌ వార్ అమెరికా ప్రగతిపైనా ప్రభావం చూపనుంది. ధరల పెరుగుదల తప్పదని తేలిపోయింది.

ట్రంప్‌ హెచ్చరికలకు ఈయూ యూనియన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తమ వస్తువులపై టారిఫ్‌లు విధిస్తే తాము కూడా అంతకంత గట్టిగానే రియాక్టవుతామని తిప్పికొట్టాయి.దక్షిణాఫ్రికాలో కొన్ని జాతుల ప్రజలను దారుణంగా అవమానిస్తున్నారని, భవిష్యత్తులో ఆ దేశానికిచ్చే నిధులను నిలిపివేస్తామని హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న దారుణాలపై విచారణ జరపాల్సి ఉందన్నారు.

బాధను భరించండి – ట్రంప్‌ :

ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల పంజా విసిరిన ట్రంప్‌ దాని ప్రభావం అమెరికాపైనా ఉంటుండటంతో స్పందించారు. ఇది అమెరికన్లకు ఇబ్బంది కలిగించే విషయమే. ధర లపెరుగుదలను భరించండి కొన్నాళ్లు.. ఇది ఆయా దేశాలకు అమెరికా ఇచ్చి తీరాల్సిన రిటార్టు.. అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం అని ప్రకటించారు. అమెరికాను ప్రేమించే వారయితే టారిఫ్‌లనూ సమర్ధిస్తారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు ట్రంప్‌. ట్రంప్ చర్యలను కెనడా, మెక్సికో తీవ్రంగా ప్రతిఘటించగా చైనా ఆ నిర్ణయాలను అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com