అభిషేక్.. ఇంగ్లీష్ బౌలర్లను షేక్ చేశాడు. క్రీజులోకి అడుగుపెట్టింది మొదలు.. ఇంగ్లండ్ బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఇన్‌స్వింగ్, ఔట్ స్వింగ్, ఫాస్ట్, స్లో, స్పిన్.. ఇలా బాల్ ఎలా వచ్చినా.. ఎటు పడి ఎటు తిరిగినా.. దాని డెస్టినేషన్ మాత్రం బౌండరీ అవతలే అన్నట్టుగా చెలరేగిపోయాడు. వాంఖడే స్టేడియం నా సామ్రాజ్యం.. నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా చెలరేగిపోయాడు. నిల్చొన్న చోట నిల్చోనే సిక్స్‌లు బాదుతుంటే వాంఖడే స్టేడియం అల్లకల్లోలమైందనే చెప్పాలి. ఓవరాల్‌గా 54 బంతుల్లో 135 పరుగులు బాదేశాడు అభిషేక్ శర్మ. ఇందులో 13 సిక్స్‌లు ఉండగా.. 7 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ మరో ఘనత కూడా అందుకున్నాడు. వ్యక్తిగత స్కోర్ల విభాగంలో అభిషేక్ ఇప్పుడు టాప్‌లో ఉన్నాడు. 126 పరుగులలతో సెకండ్ ప్లేస్‌లో గిల్ ఉన్నాడు.
కొడితే సిక్స్.. లేదంటే ఫోర్.. మొత్తంగా చూస్తే వాంఖడేలో పరుగుల వరద పారించాడు అభిషేక్ శర్మ. ఒకానొక టైమ్‌లో రోహిత్ శర్మ రికార్డ్‌ను బీట్ చేస్తాడని అనిపించినా.. అతని కంటే కాస్త స్లోగా ఆడి 37 బాల్స్‌లో సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ. అంతకంటే ముందు కేవలం 17 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు అభిషేక్. దీంతో టీమిండియా ఐదో టీ20లో భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌తో అనేక రికార్డులు సాధించాడు అభిషేక్ శర్మ..
* టీమిండియా తరపును అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ
* ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు (13) కొట్టిన ప్లేయర్‌గా అభిషేక్ శర్మ.
* అంతకుముందు ఈ రికార్డ్ రోహిత్ శర్మ (10)పేరుపై ఉండేది.
* 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ( ఇది అత్యంత వేగమైన రెండో ఇన్నింగ్స్)
* ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన అభిషేక్ రెండు వికెట్లు తీశాడు. అతడు ఇచ్చింది కేవలం మూడు పరుగులే.