- రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ సంకేతాలు?
- ట్రంప్ ప్రతిపాదనలను అంగీకరించిన పుతిన్
- ఇంధన, వాణిజ్య, డాలర్ ఆధిపత్యం పైనా చర్చలు
- పరస్పర ఒప్పందాలు, చర్చలకు శ్రీకారం
- జెలన్ స్కీకి వివరాలు చెబుతానన్న ట్రంప్
- ట్రంప్ కామన్ సెన్స్ కాంపెయన్ కు పుతిన్ ఆమోదం
ఏళ్లతరబడి నిరంతరాయంగా సాగతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ట్రంప్ నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఏకంగా గంట పాటు ఫోన్ సంభాషణ చేసినట్లు, యుద్ధ విరమణ ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించినట్లు ప్రకటించారు.నిజానికి ట్రంప్ ఫోన్ తన సొంత ప్రయోజనాల కోసమే చేశారు. డాలర్ ఆధిపత్యంపై ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలను సద్దుమణిగేలా చేసేందుకు ఆయన సంధి ప్రయత్నాలు మొదలు పెట్టారు. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందాలని గట్టిగా కోరుతున్నవారిలో పుతిన్ ఒకరు. అందుకే ఆయనను దారికి తెచ్చుకునేందుకే ట్రంప్ కాల్ చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే తాము మధ్యప్రాచ్య దేశాల గురించి, ఇంధన రంగం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపైనా, శక్తివంతమైన డాలర్ కరెన్సీపైనా మాట్లాడామని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతలను కలబోసుకున్నామని, రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాలో కోటాను కోట్లమంది మరణించిన విషయాన్ని, అమెరికా కూడా పెద్ద సంఖ్యలో జవాన్లను కోల్పోయిన అంశాన్ని గుర్తు చేసుకున్నామన్నారు.రెండు దేశాల బలాబలాలను కూడా గుర్తు చేసుకున్నామని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం మూలంగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం పైనా విచారం వ్యక్తంచేశామని ట్రంప్ అన్నారు. తాను ఉపయోగంచిన కామన్సెస్ కాంపెయిన్ ను ట్రంప్ కూడా అంగీకరించారని, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు,చర్చలు జరిపేందుకు సూచన ప్రాయంగా అంగీకరించారని ఈ చర్చల సారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీకి కూడా ఫోన్ లో తెలపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.అమెరికా, రష్యా దేశాలు మంత్రులు, కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు , వెంటనే ఇది కార్యరూపం దాల్చుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేనుంటేనా…
తాను అధికారంలో ఉంటే అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే వచ్చేది కాదని,లక్షలాది మరణాలు సంభవించేవి కాదని, తాను లేకపోవడం వల్లనే ఇది సంభమయిందని ట్రంప్ తెలిపారు. తాను విడుదల కోరిన యుద్ధ ఖైదీ మార్క్ ఫోజెల్ ను తక్షణం రష్యా విడుదల చేయడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ దగ్గర ఫోజెల్ ను తాను కలుసుకున్నానని ట్రంప్ తెలిపారు.