28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు

జర్నలిస్టుపై దాడికేసులో మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

సినీ నటుడు మంచు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీం కోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మోహన్‌బాబు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై గురువారం అత్యున్నత న్యాయస్ధానం విచారణ చేపట్టింది. కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ సుదాంశు దులియా ధర్మాసనం సీసీ ఫుటేజ్‌ ఎందుకు తొలగించారని ప్రశ్నించింది. జర్నలిస్టుపై ఎందుకు దాడి చేశారు…? ఎందుకు బెదిరించారు..? మీ కుమారుడిపై ఎందుకు ఫిర్యాదు చేశారు అని అనేక ప్రశ్నలను మోహన్‌బాబుపై సుప్రీం ధర్మాసనం సంధించింది. మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించన న్యాయవాది తాము పోలీసు విచారణకు సహకరిస్తామని, జర్నలిస్టుకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని న్యాయస్ధానాకి తెలియజేశారు. అలాగే మోహన్‌బాబు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, ఒక విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నారని, గతంలో ఎంపీగా కూడా పని చేశారని కోర్టుకు విన్నవించారు. జర్నలిస్టుపై దాడి కావలని చెయ్యలేదని, కుటుంబంలో సమస్యల వల్ల మోహన్‌బాబు, ఆయన కుమారుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని మోహన్‌బాబు తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com