26.7 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

ట్రూడో ఫైనల్ స్పీచ్.. కన్నీటితో ఫుల్ ఎమోషనల్

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఆయన గ్రాఫ్‌ పడిపోయిందని తేలడంతో ఆయన రాజీనామా చేయాలని పార్టీ నేతలు పట్టుపట్టారు. దీంతో తాను పార్టీ నుంచి, ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టుగానే మరో రెండు రోజుల్లో పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ సందర్భంగా చివరిసారిగా లిబరల్ పార్టీ అధ్యక్ష హోదాలో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తాను కెనడా కోసమే చివరి వరకు పని చేశానంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ట్రూడో.

తనకు కెనడ ప్రధానిగా పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ట్రూడ్. అయితే అదే సమయంలో ట్రంప్ టారిఫ్‌ వార్‌పై కూడా స్పందించారు. కెనడా, మెక్సికో ఆర్థికంగా బలంగా ఉంటేనే అమెరికా ఫస్ట్ అనేది సాధ్యమవుతుందని.. లేదంటే అది నెరవేరదన్నారు ట్రూడో. అందుకే ట్రంప్ ప్రారంభించిన యుద్ధంలో ఆయనకు ధీటుగా జవాబిచ్చానని చెప్పుకోచ్చారు.

నిజానికి ట్రూడో రాజీనామాకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రజలను నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజామోద రేటింగులు పడిపోవడంతో పార్టీలో కూడా వ్యతిరేకత మొదలైంది. దీంతో మిత్రపార్టీలు కూడా మద్దతును విరమించుకోవడంతో రాజీనామా చేయక తప్పలేదు. ఈ ఏడాది అక్టోబరులో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి.

2015 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు జస్టిన్‌ ట్రూడో. మొదట్లో మంచి పాపులారిటీ సాధించిన ట్రూడోపై మెల్లిమెల్లిగా వ్యతిరేకత మొదలైంది. దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో ట్రూడో విఫలమయ్యాడనే విమర్శలున్నాయి.

రాబోయే ఎన్నికల్లో కూడా ప్రధానిగా తానే బరిలోకి దిగాలనుకున్నారు ట్రూడో. అయితే ట్రూడో పోటీ చేస్తే గెలవడం కష్టమనేది సొంత పార్టీ నేతల మాట. గత కొన్నేళ్లుగా కెనడాలో ఆహారా, ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి. విదేశాల నుంచి వలస వచ్చే వారి సమస్యలు పెరిగాయని కెనడా వాసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇమ్మిగ్రేషన్‌ సమస్యలను పరిష్కరించడంలో కూడా ట్రూడో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రూడో పాపులారిటీని తగ్గించేశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com