అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అల్టిమేట్ కౌంటర్ ఇచ్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. పన్నులు పెంచుతాను.. రాయితీలు కట్ చేస్తానంటూ రీసెంట్‌గా కెనడా ప్రధానిని హెచ్చరిస్తున్నాడు ట్రంప్. అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ట్రూడో ఇప్పుడు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. నిజంగా రోషం పెరిగిందో లేక ఎన్నికలున్నాయి కాబట్టి మెత్తబడితే చేతకాని వాడనుకొని ఓట్లు వేయరనుకున్నాడో కానీ ఎట్టకేలకు ఈ విషయంపై బహిరంగంగానే నోరు తెరిచాడు. పన్నులు పెంచితే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే అని చెబుతున్నాడు ట్రూడో.
అదనంగా పన్నులు విధించినా, పెంచినా కెనడాకు ఇబ్బందులు తప్పవు.. ఎట్ ది సేమ్ టైమ్ దాని ఎఫెక్ట్ అమెరికన్లపై కూడా పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు ట్రూడో. పన్నులు పెంచడం వల్ల అమెరికాలో జీవన వ్యయం పెరిగిపోతుందని, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నాడు ట్రూడో. అమెరికా నుంచి ఇలాంటి బెదిరింపులను, సవాళ్లను గతంలో కూడా ఎదుర్కున్నామని.. ఇప్పుడు కొత్తేం కాదన్నాడు. ఒకవేళ కెనడా ఎగుమతి చేసే వస్తువులపై పన్నులు పెంచితే… తాము కూడా కౌంటర్ యాక్షన్‌లోకి దిగుతామని ట్రూడో ఇన్‌డైరెక్ట్‌గా ట్రంప్‌కు చురకలు అంటిస్తున్నారు.
అసలు ట్రంప్ గెలిచిందే అమెరికన్ల జీవితాలను మెరుగు పరుస్తానని.. కానీ పన్ను పెంచితే ఆటోమెటిక్‌గా ప్రతీ వస్తువు ధర పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ ఫైనల్‌గా పడేది అమెరికన్లపైనే కదా అని ట్రూడో చెబుతున్నాడు. అమెరికాకు ప్రధానంగా ఇంధనం, విద్యుత్, సహజవాయువులను కెనడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది.. అంతేకాదు అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా కెనడాపై ఆధారపడుతుంది అమెరికా.
మరి ట్రూడో వార్నింగ్‌తో ట్రంప్ ఆలోచనలో పడతాడా? లేక నా నిర్ణయానికి ఎదురేది అంటూ ముందుకు వెళతారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదేమైనా ట్రూడో నెక్ట్స్ ఎలక్షన్స్‌లో గెలవడం ఇటు ట్రంప్‌కు.. అటు ఎలాన్ మస్క్‌కు బొత్తిగా ఇష్టం లేదు. ఇది ఓపెన్‌గానే అనౌన్స్ చేశారు ఈ ఇద్దరు వ్యక్తులు. మరి ఈ పన్ను పెంపు కూడా ట్రూడో వల్లే అని కెనడా ప్రజలకు ఇన్‌డైరెక్ట్‌గా ట్రంప్ సందేశం పంపుతున్నారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.