ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాల ముగ్గురు అభ్యర్ధులు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ తరపు నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఆర్.కృష్ణయ్యలు అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితారాణి వద్ద తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఖళీ అయిన మూడు రాజ్యసభ స్ధానాలకు ముగ్గురే అభ్యర్ధులు నామినేషన్ వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్ధులకు మద్దతుగా మంత్రలు కింజరపు అచ్చెన్నాయుడు. నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీఆంజనేయులు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు.
- Advertisement with us -