-
బోయింగ్ జెట్ డెలివరీలు తీసుకోవద్దన్న చైనా
-
చైనా దిగుమతులపై 145 శాతం లేవీస్ విధించిన అమెరికా
-
ప్రతిగా 125 శాతం సుంకాలు విధించిన చైనా
-
విమానయాన విడిభాగాలు, పరికరాలు సైతం వద్దు
-
వాటికోసం ప్రత్యామ్నాయం అన్వేషిద్దాం అన్న చైనా
-
గతవారం కాస్త సడలింపులు ప్రకటించిన అమెరికా
-
హై ఎండ్ టెక్నాలజీ గూడ్స్ పై దిగుమతి సుంకం తొలగింపు
అమెరికా, చైనా దేశాల మధ్య టిట్ ఫర్ టాట్ టారిఫ్‌లతో ట్రేడ్ వార్ షురూ అయ్యింది. అమెరికన్ ఏవియేషన్ కు చెందిన అతిపెద్ద విమానయాన కంపెనీ బోయింగ్ సంస్థకు చెందిన జెట్‌ల నుంచి ఎలాంటి డెలివరీలు తీసుకోవద్దని చైనా తన ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది. చైనా దిగుమతులపై 145 శాతం లెవీస్ విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడంపై మండిపడిన చైనా అందుకు ప్రతిగా అమెరికా విమానయాన సంస్థ కు చెందిన డెలివరీలేవీ తీసుకోవద్దని తమ ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది.
అమెరికా చేస్తున్నది చట్టవ్యతిరేకమని, అనవసరంగా తమను రెచ్చగొడుతోందని భావించిన చైనా అమెరికా వడ్డింపులకు ప్రతిగా 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు విమానాల తయారీకి సంబంధించిన విడి భాగాలు, ఇతర పరికరాలను సైతం కొనవద్దని ఆదేశించింది. బోయింగ్ జెట్ లను అద్దెకు తీసుకునే కంపెనీలకు ట్రంప్ అధిక టారిఫ్ ల బాధ నుంచి బయట పడేసే ప్రత్యామ్నాయాలను సైతం చైనా అన్వేషిస్తోంది. ట్రంప్ టారిఫ్ ల వడ్డన ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయగా మిత్ర, శతృ దేశాలు రెండింటినీ ఒకేలా ఇబ్బందిపెట్టింది. అయితేపెంచిన టారిఫ్ ల అమలుపై తాత్కాలికంగా స్టే విధించినా చైనాకు మాత్రం ఎలాంటి ఉపశమనం దక్కలేదు. అయితే గతవారమే అమెరికా హై ఎండ్ టెక్నాలజీ గూడ్స్ పై చైనాకు ఉపశమనం కలిగించింది. స్మార్ట్ ఫోన్లు, సెమీ కండక్టర్లు,కంప్యూటర్ల పై దిగుమతి సుంకాన్ని తొలగించింది.