22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

వడదెబ్బతో మృతి చెందితే రూ. 4 లక్షల సాయం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వేసవిలో వడగాలులు, ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. మంగళవారం జారీ చేసిన జీవో నంబర్ 5 ద్వారా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇంతకుముందు ఈ పరిస్థితుల్లో రూ.50 వేలు మాత్రమే ఎక్స్ గ్రేషియా చెల్లించేవారు. ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద దీనిని రూ.4 లక్షలకు పెంచారు.

ఇక 2024 ఏడాది ఇప్పటివరకూ అత్యంత వేడిగా నమోదైంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తల్ని పాటించాలంటూ ఇప్పటికే సూచనలిచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వేసవిలోనూ అకాల వర్షాలు కురుస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. అయినప్పటికీ వేసవి పూర్తిగా ముగియలేదని, జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com