ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లబోతున్నారు. ఈనెల 17 వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటనకు వెళుతోంది. ఈనెల 20 వ తేదీన సీఎం చంద్రబాబు 75 వ జన్మదినం సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా విదేశాలకు వెళుతున్నారు. 75 వ జన్మదినోత్సవానికి అమరావతిలో ఉంటే ఎక్కువ హడావుడి చేసే అవకాశం ఉంటుందని, అలాంటి హడావిడికి తావివ్వకూడదన్న ఆలోచనతోనే సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఈ విదేశీ పర్యటనకు ప్లాన్ చేసినట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఏటా కుటుంబంతో ఐదు రోజుల పాటు విదేశాల్లో గడిపే ఆనవాయితీ నేపథ్యం కూడా ఇందులో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు 17 వ తేదీ ఉదయం 1.15 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లి 21 వ తేదీ అర్ధరాత్రి తిరిగి రానున్నారు. చంద్రబాబు దంపతుల వెంట కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కుడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
- Advertisement with us -