ప్లే ఆఫ్స్ రేస్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్.. తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సైలెంట్‌గా ఒక్కో మ్యాచ్‌ను గెలిచేస్తూ టాప్ ప్లేస్ నుంచి కదిలేందుకు అస్సలు అంగీకరించడం లేదు. లేటెస్ట్‌గా కోల్‌కత్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారిని వారి సొంత గడ్డపైనే మట్టికరిపించింది. అటు బ్యాటర్లు.. ఇటు బౌలర్లు.. ఎవరూ ఎక్కడా తగ్గకుండా పర్ఫామ్ చేయడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
శుభ్‌మన్, సాయి ఇద్దరు ఓపెనర్స్ మొదట దంచేస్తారు. ఆ తర్వాత బట్లర్ వచ్చి ఆ జోరును కంటిన్యూ చేస్తాడు. మొత్తంగా చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు షాకులు ఇస్తారు. ఇక బౌలర్లలో సిరాజ్, ఇషాంత్ ఉండనే ఉన్నారు. ఇక వీరిని దాటి తన పర్ఫామెన్స్‌తో ప్రసిద్ కృష్ణ ప్రత్యర్థులపై చెలరేగిపోతాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్‌ను తిప్పేసేందుకు రెడీగా ఉంటారు. ఇవన్నీ కలిసి ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్‌ను టాప్ ప్లేస్‌లో తిష్టవేసేలా చేశాయి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడితే.. అందులో 6లో గెలుపు వీరిదే.
కోల్‌కతాపై ఎప్పటిలాగానే సాయి, గిల్ విరుచుకపడ్డారు. గగిల్ అయితే ఏకంగా 90 పరుగులు చేశాడు. సాయి ఎప్పటిలాగానే ధనాధన్ షాట్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక బట్లర్ 41 పరుగులు చేసి కోల్‌కతా ముందు 199 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచారు. గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో..కోల్‌కతా 159 పరుగులకే పరిమితమైంది. ఒక్క రహానె తప్ప మిగతా వాళ్లంతా తేలిపోయారు.
తొలి ఓవర్లోనే సిరాజ్ … గుర్బాజ్‌ను పెవిలియన్‌కు పంపేశాడు. నరైనా కూడా వెనుదిరిగాడు. ఈ టైమ్‌లో రహానె ఒక్కడే కాసేపు గుజరాత్‌పై పోరాటం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ మరోసారి నిరాశ పరిచాడు. రసెల్ కాస్త ఆశలు పెంచినా ఫలితం లేకుండా పోయింది. చివరో రఘువంశీ కాస్త వేగంగా ఆడినా.. అది రన్‌రెట్‌ను తగ్గించేందుకే తప్ప విజయానికి పనికి రాలేదు.