25 C
Hyderabad
Monday, August 10, 2026

Live Video

spot_img

ఫ్లాట్లకోసం జర్నలిస్టుల దరఖాస్తులకు రేపే గడువు

సొంతిళ్లు లేని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్లలో అవకాశం కల్పిస్తోంది. సాధారణ పౌరుల మాదిరిగానే ఇళ్లు కావాలనుకునే జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇచ్చింది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ కింద హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్లో ఫ్లాట్లకోసం దరఖాస్తులకు అవకాశం కల్పించింది. బండ్లగూడతో పాటు.. పోచారం, గాజుల రామారం, జవహర్‌నగర్‌ ప్రాంతాల్లో పలు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. వీటిని వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించే కనీస ధరకు కొనుగోలు చేసుకోవడానికి జర్నలిస్టులు పేర్లు ఇవ్వాలని కోరింది. ఆసక్తి ఉన్న జర్నలిస్టులకు ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్‌లను చూపిస్తామని తెలిపింది. ఈ ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 5వ తేదీలోగా వాట్సప్‌ ద్వారా తమ పేర్లు, వివరాలను 7702003518 నెంబర్‌కు పంపించాలని సమాచార, పౌర సంబంధాల ఖాఖ ప్రకటన విడుదల చేసింది. ఎవరికైనా సందేహాలు ఉన్నా పై నెంబర్‌లో సంప్రదించాలని కోరింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com