24.8 C
Hyderabad
Monday, August 10, 2026

Live Video

spot_img

ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలుడు ఒకరు మృతి

ఒక ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలుడు సంభవించి ఒక కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూర్ లో ఉన్న ప్రీమియర్ ఎక్ ప్లోజీవ్స్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతిచెందగా, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మంది కార్మికులు కూడా గాయపడగా వారిని కూడా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించినట్లు సమాచారం. పేలుడు సంభవించడానికి కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుడికి భారీగా నష్టపరిహారం చెల్లించడంతో పాటు క్షతగాత్రులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com