బీసీసీఐ ఉమెన్స్ టీమ్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టులను అనౌన్స్ చేసింది. 2024-25 సీజన్‌కు సంబంధించి ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. మొత్తం16 మంది ఆటగాళ్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ లను మూడు గ్రేడ్లుగా విభజించింది. ఇక్కడ కేవలం ముగ్గురంటే ముగ్గురు ప్లేయర్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ ఏలో చోటు దక్కింది. ఇక గ్రేడ్ బీలో నలుగురికి, గ్రేడ్ సీలో తొమ్మిదిమంది ప్లేయర్స్‌కు చోటు దక్కింది.
బీసీసీఐ మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా
గ్రేడ్ A
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.
గ్రేడ్ B
రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ.
గ్రేడ్ C
టైటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ రాణా, పూజ వస్త్రాకర్, యాస్టికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్.
గ్రేడ్ ఏలో ఉన్న ప్లేయర్లకు రూ.50 లక్షలు, గ్రేడ్ బీలో ఉన్నవారికి రూ.30 లక్షలు, గ్రేడ్ సీలో ఉన్నవారికి రూ. 10 లక్షలు ఏడాదికి అందజేస్తారు. మ్యాచ్ ఫీజులు దీనికి అదనం. అయితే ఈసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చాలా మార్పులు కనిపించాయనే చెప్పాలి. కొంతమంది ఆటగాళ్ళు ఎలిమినేట్‌కాగా మరికొందరికి అదృష్టం కలిసి వచ్చింది. గ్రూప్ సీ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో మేఘనా సింగ్, దేవిక వైద్య, ఎస్ మేఘనా, అంజలి సర్వాణి, హర్లీన్ డియోల్ ఉన్నారు. ఇక గ్రేడ్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు..
ఇక తెలంగాణ అమ్మాయి భారత ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి మాత్రం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ సీలో ఆమెకు చోటు దక్కింది. అరుంధతి గతేడాది వన్డే, టీ20ల్లో కలిపి 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసింది. ఈ ఏడాది భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో టైటిల్ లక్ష్యంగా భారత జట్టు దృష్టి పెట్టింది. వచ్చే నెలలో శ్రీలంక, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడనుంది.