38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

నెంబర్‌ ప్లేట్‌లో డబ్బులున్నాయ్‌!

వాహనానికి నెంబర్‌ ప్లేట్‌ అంటే ఒకప్పుడు చాలా లైట్‌ తీసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడలా లేదు. కాలం మారింది. నమ్మకాలు పెరిగాయి. విశ్వాసాలు నడిపిస్తున్నాయ్‌. ఆందుకే నెంబర్‌ ప్లేట్లలో డబ్బులున్నాయ్‌. ఫ్యాన్సీ నెంబర్లయితే కాసుల వర్షమే కురుస్తుంది.

ఈ పరిస్థితులను ప్రభుత్వం పసిగట్టింది. అందుకే నెంబర్‌ ప్లేట్లను కొన్నేళ్లుగా వేలం వేస్తోంది. లక్షలకు లక్షలు సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జరిగిన వేలం పాటలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది.

మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఒక్కరోజే రూ.52లక్షల69వేల216 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. టీజీ07 ఆర్9999 నంబర్‌కు అత్యధికంగా పన్నెండున్నర లక్షల ఆదాయం లభించింది. ​ను కాన్‌గ్రుయెంట్‌ ​ డెవలపర్స్‌‌‌‌ కంపెనీ నిర్వాహకులు ఈ నెంబర్‌ను రూ.12,49,999 కి చేజిక్కించుకున్నారు.

ఇక, మిగతా ఎక్కువ ఆదాయం వచ్చిన నెంబర్లు చూస్తే.. టీజీ07 ఏఏ0009 నెంబర్‌కు రుద్రా ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కంపెనీ రూ.8.50లక్షలకు సొంతం చేసుకుంది. టీజీ07 ఏఏ0001 నెంబర్‌ను ఫ్యూజీ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీ రూ.4.77లక్షలకు దక్కించుకుంది. అలాగే, టీజీ07 ఏఏ0099ను మంగ్యా జ్యోతి రూ.2.81లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నారు. ఇక, టీజీ07 ఏఏ0006 నెంబర్‌ ను మారబోయిన మహేశ్‌ కుకుమార్‌‌‌‌ రూ.1,99,999కు చేజిక్కించుకున్నాడు. అదే విధంగా టీజీ07 ఏఏ0027 నెంబర్‌ను గుర్రం మిథున్‌‌‌‌రెడ్డి రూ.1.32 లక్షలకు సొంతం చేసుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com