36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సర్వోన్నత న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా భూషన్ రామకృష్ణ గవాయ్ పేరును కొలిజీయం సిఫార్సు చేసింది. మే 13న ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా రిటైర్ కానుండటంతో.. మే 14న ఆయన కొత్త CJIగా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగనున్నారు.

ఎవరీ జస్టిస్ బీఆర్ గవాయ్?
బీఆర్ గవాయ్.. పూర్తిగా చెప్పాలంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 మే 24 మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు గవాయ్. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1985లో నాగ్‌పూర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంఛించిన ఆయన.. 1987 నుంచి బాంబే హైకోర్టులో తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. 1990 నుంచి నాగపూర్ బెంచ్‌ ముందు ప్రాక్టీస్ చేశారు ఆయన. ఈ సమయంలో రాజ్యాంగ చట్టం, అడ్మినిస్ట్రేటివ్‌ లాపై ప్రాక్టీస్‌ కొనసాగించారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి యూనివర్సిటీకి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు.

ఇదే సమయంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 1992 ఆగస్టు నుంచి 1993 జులై వరకు ఆయన సేవలు కొనసాగాయి. 2000 జనవరి 17న నాగ్‌పూర్ బెంచ్‌ ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాపిక్యూటర్‌గా నియమితులయ్యారు గవాయ్. 2003 నవంబర్ 14న హైకోర్టు అడిషినల్ జడ్జ్‌గా నియమితులయ్యారు. 2005 నవంబర్ 12న బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. ఈ సమయంలో నాగ్‌పూర్, ఔరంగాబాద్, పణాజీ, ముంబై బెంచ్‌ల్లో తన సేవలు అందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపికయ్యారు.

ఈ ఏడాది నవంబర్‌ 23న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో బీఆర్ గవాయ్ 6 నెలలు మాత్రమే CJIగా తన సేవలను కొనసాగించనున్నారు.

జస్టీస్ బీఆర్ గవాయ్ ఎస్సి మాల వర్గానికి చెందినవారు కాగా మాదిగలకు న్యాయం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ దిశగా చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com