25.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

బీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట జరుగుతోంది

బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్

భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో ఆధిపత్యం కోసం మూడు ముక్కలాట నడుస్తోందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ వ్యవహార సరళిపై మహేష్‌గౌడ్‌ ఫైర్‌ అయ్యారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీలో కేటీఆర్‌, హారీష్‌, కవితల మద్య మూడు ముక్కలాట నడుస్తోందని చెప్పారు. కేటీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విపక్ష హోదా ఎందుకని మహేష్‌ గౌడ్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి అభ్యర్ధులే లేరని అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవ్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మిత్రుత్వం ఉందని మహేష్‌గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున  ఎనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులను గెలిపిస్తే రాష్ట్రానికి బడ్జెట్‌లో తెచ్చిన నిధులు గాడిద గుడ్డులా ఉన్నాయని టీపీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com