36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

మహాకుంభమేళా ట్రిప్ ఓ అద్భుత జ్ఞాపకం

  • మలుపు మలుపుకీ ఎన్నెన్నో అట్రాక్షన్స్
  • దేశంలోనే తొలిసారి లేజర్‌ వాటర్‌ షో
  • అడ్వెంచరస్‌ గేమ్స్ అండ్ స్పోర్ట్స్
  • అఖాడా వాక్‌, హెరిటేజ్‌ వాక్‌,డిజిటల్‌ ఫోటో గ్రఫీ
  • నాగ సాధువులను అతి దగ్గర నుంచి చూసే ఛాన్స్
  • అనేక యోగా ప్యాకేజెస్‌, ఫుడ్‌ కోర్టులు
  •  ఆకట్టుకుంటున్న హెలికాప్టర్‌ జాయ్‌ రైడ్‌

ప్రయాగ్‌ రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లేవారికి అక్కడ పవిత్ర స్నానాలు, పితృ తర్పణాలు ఆచరించడమేకాదు ఓ పెద్ద సాంస్కృతిక మహోత్సవాన్ని, జాతరను  అతి దగ్గరనుంచి చూసే అదృష్టం కూడా కలుగుతుంది. కుంభమేళాకు తరలి వచ్చే సందర్శకుల కోసం ఎన్నో అడ్వెంచరస్‌ గేమ్స్, సాంస్కృతిక సదస్సులు, కళారూపాలు, దర్శనీయ ఆలయాలు, నదీ విహారం ఒకటేమిటి ఎన్నెన్నో స్పెషల్‌ అట్రాక్షన్స్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన లేజర్ వాటర్‌ షో ఆకట్టుకుంటోంది. మూడురోజుల పాటు ద్రోణ్ షో డిస్ ప్లే, వాటర్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్, హెలికాప్టర్ జాయ్ రైడ్‌, అకాఢా వాక్, హెరిటేజ్ వాక్, యోగా ప్యాకేజెస్, అనేక రకాల ఫుడ్‌ కోర్టులు ఇలా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. వీటన్నింటికీ మించి అసలు మెగా టెంట్‌ సిటీని చూడటమే ఒక మహాయోగం.

యూపి దర్శన్‌ మండపమ్ పేరుతో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన హ్యాండీ క్రాఫ్ట్స్  మార్కెట్‌ లను ఏర్పాటు చేశారు. మూడు స్టేజీలలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇవేకాక సెల్ఫీ పాయింట్లను, డిజిటల్‌ ఎగ్జి బిషన్‌, రకరకాల అట్రాక్టివ్‌ వాక్స్, యోగా ప్యాకేజీలకు తోడు హెలికాప్టర్ జాయ్‌ రైడ్‌ మరో స్పెషల్‌ అట్రాక్షన్.

నాగసాధువులు, అఘోరాలు, కల్పవసీలు నివసించే ప్రత్యేక అఖాడాల సందర్శన కూడా ఒక అట్రాక్షన్. నాగసాధువుల జీవనం, ఇతర వివరాలను దగ్గర నుంచి చూసి తెలుసుకునేవారు అక్కడకు వెళ్లొచ్చు. వారిని డిస్ట్రబ్‌ చేయకుండా రోజంతా వారితో దగ్గర నుంచి చూడొచ్చు.

సెక్టర్‌ 6నుంచి 9 వరకూ అఖాడాలకు కేటాయించారు. దీనికి రెండు వేల రూపాయల టిక్కెట్ ఉంది. మొత్తం 13 అఖాడాలను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.

హెరిటేజ్ వాక్‌ సందర్శించాలంటే సెక్టర్ వన్ కు చేరుకోవాలి.కిడ్ గంజ్‌ నుంచి ఫోటోగ్రఫీ వాక్‌ చేయవచ్చు.

సెక్టర్‌ 25 దగ్గర రూ.1,296 రూపాయలు చెల్లిస్తే హెలికాప్టర్ జాయ్ రైడ్‌ కు వెళ్లొచ్చు. ఆకాశం నుంచి టెంట్‌ సిటీ మొత్తం చూడొచ్చు.

కళాహృదయుల సంగీత విభావరిల కోసం నాలుగు ప్రత్యేక మండపాలను నిర్మించారు. ఒక్కో దానిలో కనీసం 10 వేల మంది కూర్చుని ప్రదర్శనలను తిలకించవచ్చు. దేశవ్యాప్తంగా పేరొందిన సంగీత కళాకారులను ఆహ్వానించారు.శంకర్ మహదేవన్,రోనూ మజుందార్, సాధనా సర్గమ్‌,షాన్‌, మాలినీ అవస్తి, కైలాస్ ఖేర్, మోహిత్‌ చౌహాన్ లాంటి కళాకారులు తమ గానంతో ఆకట్టుకుంటున్నారు.

ఈనెల24,25,26 ఈమూడు తేదీల్లోనూ 2,500 ద్రోన్ లు ఆకాశంలో వీర విహారం చేస్తూ వినూత్న ప్రదర్శనలిస్తాయి. ముఖ్యంగా  రిపబ్లిక్ డే థీమ్ తో జరిపే ద్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. దీవాలీ రోజున అయోధ్యలో కోటి దీపోత్సవం తర్వాత జరుపుతున్న అతిపెద్ద దీపోత్సవం కూడా ఇదే.

త్రివేణీ దర్శన్,కాళీ ఘాట్ ల దగ్గర ప్రతీరోజు సాయంత్రం 7 గంటలకు, 9 గంటలకు రెండు వాటర్‌ షోలు ప్రదర్శిస్తున్నారు.

స్పెషల్‌ యోగా కోర్పులుః కుంభమేళాకు వచ్చే వారు మూడు, నాలుగు రోజులు ఉండి అన్నీ చూడాలనుకునేవారికి స్వల్ప కాలిక యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రాణాయామ లాంటివి సెక్టర్‌ వన్ లో ఉదయం, సాయంత్రం వేళల్లో నేర్పిస్తారు. మనిషికి రూ.5 వేల రూపాయలు ఎంట్రీ ఫీజు..

ప్రయాగ్‌ రాజ్ లో తొలిసారి నీటిపై స్పీడ్‌ బోట్స్ తో వాటర్ అడ్వెంచర్ గేమ్‌ షోలు కూడా సందర్శకులు ఎంజాయ్‌ చేయవచ్చు. దీనికోసం సెక్టర్ వన్, 25 దగ్గరకు వెళ్లాలి.

కాబట్టి ప్రయాగ్‌ రాజ్ మహాకుంభమేళాలో భక్తితో పాటు ఆనందాన్నీ పొందచ్చు.. మానసిక ప్రశాంతతను పొందచ్చు. ప్రపంచంలోకే అతిపెద్ద సాంస్కృతిక మేళాను ప్రత్యక్షంగా చూడొచ్చు. వేలాది మందితో మాట్లాడొచ్చు. భిన్న సంస్కృతులు చూడొచ్చు.అనూచానంగా వస్తున్నహిందూధర్మం గురించి,హైందవ సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. విదేశీ టూరిస్టులను కలవొచ్చు. నాగ సాధువులను కలవొచ్చు. పవిత్ర దేవాలయాలను సందర్శించవచ్చు. అందుకే మహాకుంభమేళాకు కొత్త ఉత్సాహంతో బయల్దేరండి.ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com