ఓ ఫెయిల్యూర్ ఇప్పుడు వారి అస్థిత్వాన్నే ప్రశ్నించాయి. మీరు ఆటకు అవసరమా? అనే ప్రశ్నను తెరపైకి తీసుకోచ్చింది. మీరు ఏమైనా దైవాంశసంభూతులా..? లేక పై నుంచి ఏమైనా ఊడిపడ్డారా? అనే చర్చకు తెరలేపాయి. మరి ఇవన్నీ వారి దగ్గరికి చేరాయో.. లేక వారిలో అంతర్మథనం మొదలైందో తెలీదు కానీ దెబ్బకు దిగొచ్చారు. అందరితో పాటే మేమూ అంటూ దేశవాళీల్లోకి అడుగు పెట్టారు.
BGT సిరీస్ ఓటమి తర్వాత ఎక్కువగా విమర్శలు అందుకున్నది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరు అసలు దేశవాళీల్లో ఎందుకు ఆడరు? వారి ఆటను ఎందుకు మెరుగుపర్చుకోరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అంతేకాదు వాళ్లు దేశవాళీ టోర్నీలు ఆడాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో వారి మనసు కూడా మారింది. ఇప్పటికే రోహిత్ రంజీ జెర్సీల్లో కనిపించగా.. కోహ్లీ కూడా బరిలోకి దిగేందుకు సై అన్నాడు.
దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ నెల 30న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని సమాచారమిచ్చాడు కోహ్లీ. ఈ నెల 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు మాత్రం దూరం కానున్నాడు. BGT సిరీస్‌లో కోహ్లీ మెడకు గాయమైంది. ప్రస్తుతం దానికి చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు రోహిత్ ఇప్పటికే రంజీ బరిలోకి దిగారు. ముంబై తరపున అజిక్యా రహానే కెప్టెన్సీలో ఆడతున్నాడు రోహిత్.
మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా టీమిండియా సిద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 14 లేదా 15న దుబాయ్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా తన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుంది.