22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

గ్రామసభల్లో టెన్షన్ టెన్షన్

  • గ్రామసభల్లో ఘర్షణ వాతావరణం
  • సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మధ్య ఘర్షణ
  • రెండో రోజు అదే తీరు
  • మొదటిరోజు సభలకు డుమ్మా కొట్టిన మెజార్టీ మంత్రులు
  • రెండో రోజు అలర్ట్ అయిన ప్రభుత్వం
  • రేపటి నుంచి ప్రతి జిల్లాలో మంత్రులు గ్రామసభల్లో పాల్గొనాలని డైరెక్షన్

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభలు టెన్షన్ వాతావరణంలో జరుగుతున్నాయి. సభల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం రెండో రోజు కూడా చాలా జిల్లాల్లో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలు కీలక కావడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే చాలాచోట్ల ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మధ్య వివాదానికి దారితీస్దోంది. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు మంచి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో ఈ సమావేశాలను గ్రామస్థాయిలో నిర్వహిస్తుంటే దీన్ని రాజకీయ వేదికగా మార్చుకోవడానికి బిఆర్ఎస్ ప్రయత్నిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఇక ఈ సభల ప్రాధాన్యత విషయానికొస్తే  గ్రామసభలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ, అర్హుల జాబితా ప్రకటన.. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ.. గత దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితాను ప్రకటించన వంటివి చేయనున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా మంచి స్పందనే ఉంది అయితే గతంలో తాము దరఖాస్తులు చేసుకున్న వాటిని పట్టించుకోవడంలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న వారికి మాత్రమే లబ్ధిదారుల జాబితాలో చేరుస్తున్నారనేది కొందరు వాదన. ఈనెల 24 వరకు కొనసాగనున్న గ్రామసభలు కొనసాగులున్నాయి.

ఉమ్మడి నల్గొండ కరీంనగర్ మహబూబ్‌నగర్, ఖమ్మం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో గ్రామసభల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొదటిరోజు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా చోట్ల కట్టుదిట్ల పైన భద్రత ఏర్పాట్లు కూడా చేసింది.. అయితే తొలి రోజు జరిగిన గ్రామసభలకు చాలామంది మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ హాజరు కాకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి అందర్నీ అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన గ్రామసభలకు చాలామంది మంత్రులు హాజరయ్యారు. కరీంనగర్లో జరిగిన గ్రామసభలకు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మెదక్ మహబూబ్‌నగర్‌లో జరిగిన గ్రామసభలకు మంత్రి దామోదర్ రాజనర్సింహులు హాజరయ్యారు. చాలా చోట్ల మంత్రులు కూడా ఈ రోజు జరిగిన సభలకు హాజరయ్యారు. రాజకీయం కోసం ఈ సభలను వాడుకోవద్దని ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరి చేస్తామని అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిద్దిపేటలో జరిగిన గ్రామసభలకు స్వయంగా హరీష్ రావు హాజరయ్యారు.  ప్రభుత్వం పథకాల పేరిట ప్రచారం చేస్తోంది కానీ వాటిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు..

మొత్తానికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ప్రభుత్వం కొంత అలర్ట్ గానే ఉన్నట్టుగా కనిపించింది. గురువారం నుంచి పెద్ద సంఖ్యలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర సీనియర్లు కూడా గ్రామసభలకు హాజరు కానున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. మొత్తానికి సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు గ్రామ సభలను వేదికగా చేసుకొని తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ వాదనలు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com