33 C
Hyderabad
Sunday, May 31, 2026

Live Video

spot_img

ఫ్యూచర్ అంతా క్రిప్టో కరెన్సీదే…ట్రంప్ సంకేతాలు

డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్…కాంబినేషన్ గురించి మొన్నటి అగ్రరాజ్య అధ్యక్షుడి ఎన్నికల సమయంలో ప్రపంచం అంతా చర్చించుకుంది. ట్రంప్ గెలుపుకు మస్క్ తన శక్తి యుక్తులు అన్నీ ఎలా ఒడ్డించాడో చూసింది. ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ట్రంప్ ఎన్నికల కోసం మస్క్ ఖర్చు చేసినట్లు తాజా ఫెడరల్ గణాంకాలు బయటపెట్టాయి. మొత్తం మీద అనుకున్నట్లే ట్రంప్ గెలిచాడు. ఆ వెంటనే ఎలాన్ మస్క్ ను తన మంత్రివర్గంలో చోటు ఖాయం చేశాడు. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎపీషియన్సీ అనే విభాగానికి అధిపతిని చేశాడు. స్పేస్ టెక్నాలజీ కింగ్ గా పరిగణించే ఎలాన్ మస్క్ ను తన పాలనలో భాగస్వామిని చేసి టెక్నాలజీ, సమర్థవంతమైన పాలన పై తన అడుగులు ఎలా ఉంటాయో మెసేజ్ ఇచ్చిన ట్రంప్…ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పై కన్నేశాడు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో కరెన్సీ అంశాల పై దేశాధ్యక్షుడికి సలహాలు ఇచ్చేందుకు తన కార్యవర్గంలో కొత్త పదవినే సృష్టంచారు డొనాల్డ్ ట్రంప్. ఏఐ, క్రిప్టో కరెన్సీ జార్ (Czar) గా పేపాల్ మాఫియా సభ్యుడైన డేవిడ్ ఓ. శాక్స్ ను నియమించారు. మాఫియా అనగానే ఇదేదో చీకటి వ్యవహారం అనే భ్రమ కలగటానికి అవకాశం ఉంది. కాని వాస్తవంగా ‘పేపాల్ మాఫియా’ అన్నది పేపాల్ అనే సంస్థ మాజీ ఉద్యోగుల బృందం. పేపాల్ సంస్థ నగదు బదిలీ సేవల కోసం పాతికేళ్ళ కిందటే ఏర్పడింది. ఆ తర్వాత 2002లో ఈ సంస్థను ఈబే కొనుగోలు చేసింది. ఈ క్రమంలో మాతృ సంస్థలోని కొంత మంది ఉద్యోగులు బయటకు వచ్చి వివిధ టెక్ కంపెనీలు స్థాపించి సిలికాల్ వ్యాలీ రూపురేఖల్నే మార్చేశారు. వీరిని సిలికాన్ వాలీ అత్యంత ధనిక వ్యక్తుల బృందంగా, అమెరికాలో శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా వ్యవహరిస్తారు. వీరంతా కోట్లకు పడగలెత్తినా పేపాల్ మాఫియా బృందంగా తమ బంధాన్ని కొనసాగించారు.

అంతరిక్షం నుంచి టెస్లా కార్ల వరకు, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ వరకు టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఎలాన్ మస్క్ కూడా ఈ పేపాల్ మాఫియా సభ్యుడే. ట్రంప్ తాజాగా ఈ మాఫియా మరో సభ్యుడు డెవిడ్ శాక్స్ కు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. డేవిడ్ పేపాల్ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అప్పట్లో వ్యవహరించారు. డేవిడ్ కూడా వందల కోట్ల డాలర్లకు అధిపతి. ఫేస్ బుక్, ఊబర్, ఎయిర్ బీఎన్బీ, స్పేస్ ఎక్స్ వంటి పలు టెక్ సంస్థల్లో ఒక పెట్టుబడిదారుడు. అంతే కాదు ప్రఖ్యాత పాడ్ కాస్టర్ కూడా. ఈ మొత్తం పోర్ట్ ఫోలియో చూస్తే డేవిడ్ శాక్స్ ఏ స్థాయి వ్యక్తో అర్థం అవుతుంది. ఇటువంటి శాక్స్ ను తాజాగా ట్రంప్ ఓవర్సీస్ ఏఐ, క్రిప్టో కరెన్సీ జార్ గా నియమించటం కీలకమైన పరిణామం. ప్రధానంగా ఏఐ, క్రిప్టో కరెన్సీ రంగాల్లో అమెరికా ప్రపంచానికి దిక్సూచి కావాలని ట్రంప్ అభిలాష.

ట్రంప్ విధానాలు క్రిప్టోకరెన్సీకి ఎంత ఊతం ఇవ్వనున్నాయో మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజా పరిణామాలతో ఇవాళ క్రిప్టో కరెన్సీ రికార్డులు సృష్టించింది. ప్రపంచ క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ బిట్ కాయిన్ రికార్డ్ స్థాయిలో లక్ష కోట్ల డాలర్ల మార్క్ ను దాటింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాతి క్రిప్టో అనుకూల లా మేకర్స్ పలువురిని నియమించారు. క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా సులభతర నియంత్రణలు తెస్తారని అమెరికా వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ ఆస్తులు వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పుల దిశగా ట్రంప్ ప్రస్తుత అడుగులు కనిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com