37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

ఆదివారం రాత్రి నక్లెస్ రోడ్లో సినీ తారల సందడి

ప్రజా విజయోత్సవాలలో భాగంగా నక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లలో ఆదివారం సాయంత్రం సినీ తారలు సందడి చేయనున్నారు. ప్రముఖ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలిలతో పాటు మరికొందరు సినీ నటులు సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హాండి క్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం, ఐమాక్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కు హాజరవుతారు.

రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షో

ఐమాక్స్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం 7 గంటలకు సినీ గాయకుడు రాహుల్ సింప్లి గంజ్ ఆయన బృందంచే అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా శని వారం నాడు ఏర్పాటు చేసిన వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ కు నగరవాసుల నుంచి విశషమైన ఆదరణ లభించింది. ఈరోజు జరిగే రాహుల్ సిప్లిగంజ్ సంగీత విభావరికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఆదివారం సెలవు కావడం నేడు సాయంత్రం 4 వైమానిక విన్యాసాలను ( ఎయిర్ షో ) వీక్షించడానికి భారీ సంఖ్యలో నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరూ కూడా రాహుల్ సిప్లిగంజ్ షోకు కూడా హాజరవుతారని, ఇందుకు తగ్గట్టుగా అధికారులు తగు ఏర్పాట్లను చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com