ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ మరణంతో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. దేశానికి అవిశ్రాంతంగా సేవలందించిన గొప్పనాయకుడని కొనియాడారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక పదవులను నిర్వహించారని తెలిపారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి ఉన్నారు.