- ఇన్ స్టా లో వైరల్ గా మారిన ప్రొఫెసర్ డ్యాన్స్
- వీడియోను వీక్షించిన 70 మంది వ్యూవర్స్
పుష్ప 2 సినిమా కాంట్రవర్సీ మాటేమో గానీ ఆ సినిమా పాటలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పుష్ప 2 సినిమాలో పీలింగ్స్.. పాట ఇప్పుడు దుమ్ము రేపుతోంది.కొచ్చిన్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఈ పాటకు స్టూడెంట్స్ తో కలసి స్టెప్పులేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్వతీ వేణు అనే హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు కాలేజీలో తన స్టూడెంట్స్ తో కలసి పుష్ప 2 లోని పీలింగ్స్.. పీలింగ్స్ పాటకు స్టెప్పులేశారు. ఒ నెటిజన్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఈ వీడియోను ఇప్పటికే 70 లక్షల మంది చూశారు.ముందు స్టూడెంట్స్ డాన్స్ చేస్తుంటే ఆ ప్రొఫెసర్ గారికి కూడా నాలుగు స్టెప్పులేయాలనిపించిందేమో.. చేతిలో ఉన్న బ్యాగును పక్కన పెట్టి మరీ రంగంలోకి దిగారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు కూడా ఎక్కువయ్యాయి. ఇది కదా స్టూడెంట్ లైఫ్ అంటే అని కింద ఒకరు కామెంట్ చేస్తే.. అందరు ప్రొఫెసర్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అన్నారు. మరొకరు కాలేజ్ డేస్ మరింత మెమొరబుల్ గా ఉంటాయి ఇలాంటి గురువులుంటే అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.క్లాస్ రూమ్ పల్స్ పట్టుకున్న ప్రొఫెసర్ గారు అంటూ మరొకరు కితాబిచ్చారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా పెర్ఫార్మ్ చేసిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు.