26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

కొరడాతో కొట్టుకున్న అన్నామలై

  • డీఎంకే పాలనకు వ్యతిరేకంగా స్వీయ శిక్ష
  • డీఎంకేను గద్దె దించేంత వరకూ పాదరక్షలు వాడనని శపథం

ప్రభుత్వంపై వ్యతిరేకతను రకరకాలుగా తెలియచేస్తాం..నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు ఇలా..అలాగే తాము అనుకున్నది సాధించే వరకూ చేసే మంగమ్మ శపథాలు చూశాం.. కానీ తమిళనాడు బీజేపి అధ్యక్షుడు అన్నామలై ఓ వింత సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. డీఎంకే ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఆయన స్వీయ శిక్ష విధించుకున్నారు. తమిళనాడులో డీఎంకెను గద్దె దింపేవరకూ ఆయన చెప్పులు ధరించబోనని నిన్న తన నివాసం లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రకటించారు.డిఎంకే గద్దె దిగేంత వరకూ తాను చెప్పులు లేకుండానే నడుస్తానని ప్రకటించారు. అంతేకాదు 48 రోజుల పాటు నిరాహార దీక్షకూడా చేస్తానన్నారు. వీటన్నింటికన్న హైలెట్ ఏంటంటే డీఎంకే తప్పులకు తనకు తాను ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన వ్యక్తం చేస్తానన్నారు. అన్నట్లుగానే ఇవాళ తన నివాసంలో ఆరుబయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. డిఎంకె పాలన అవినీతి మయమైపోయిందని,శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. అన్నా వర్సిటీ సెక్స్ స్కాండల్ లో బాధితులే దోషులుగా చూపే ప్రయత్నం జరుగుతోందన్నారు. తరచుగా నేరాలు చేసే రౌడీ జ్నాన శేఖరన్ కు అన్నా యూనివర్సిటీ సెక్స్ స్కాండల్ లో సంబంధమున్నా..డీఎంకె నేతలతో ఉన్న సంబంధాల కారణంగా అతగాడి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న ఈఅరాచకాలపై స్పందించక పోగా ఉత్తరాది , దక్షిణాది విభేదాలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ డీఎంకే పై విరుచుకు పడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com