భారత దేశంలో కొన్నేళ్లుగా జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది. అటు.. టెక్నాలజీ పురోగతిలో దూసుకుపోతోంది. ఇటు.. లివింగ్ కాస్ట్ కూడా పైపైకి ఎగబాకుతోంది. అనివార్యంగా జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ సాంకేతికత ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆ ఉద్యోగాలకు ఇస్తున్న జీతాలు కూడా మంచిగానే ఉంటున్నాయి. ఫలితంగా జీవన వ్యయం భారీగా పెరిగిపోతోంది.
జీవన ప్రమాణాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలు, రోజు రోజుకూ అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగుదల, ఇంటి అద్దెలు, వాహనాలకు పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రయాణాల కోసం రవాణా చార్జీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ విషయంలోనూ ధరలు పెరిగిపోయాయి. రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉన్నాయి.
గ్రామాలు, పట్టణాలు, నగరాలతో పోలిస్తే.. మెట్రో పాలిటన్ నగరాల్లో లివింగ్ కాస్ట్ మరింత ఎక్కువగా ఉంటోంది. ఏనాడో మెట్రో పాలిటన్ నగరాల జాబితాలో చేరిపోయిన హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటి ఖర్చులు, నిత్యావసర ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి అంశాల్లో వ్యయం ఎక్కువగా ఉంటోంది. అయితే, దేశంలో లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉన్న టాప్ మెట్రో పాలిటన్ సిటీస్ చూద్దాం…
ముంబై :
భారతదేశ ఆర్థిక రాజధానిగా ముంబైని చెప్పుకుంటాం. ముంబైలో ఇంటి ఖర్చులు అంటే..అద్దెలు, రియల్ ఎస్టేట్ ధరలు చాలా ఎక్కువ. అక్కడ లైఫ్ స్టైల్, ట్రాన్స్ పోర్ట్, ఎంటర్ టైన్‌మెంట్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పరిగణించబడుతోంది.
న్యూ ఢిల్లీ :
దేశ పరిపాలనా రాజధాని నగరం న్యూ ఢిల్లీ. రాజధాని నగరంగా ఢిల్లీలో ఇంటి నిర్వహణ ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్, జీవన సౌకర్యాలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. అక్కడ అధునాతన సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల జీవన వ్యయం క్రమంగా పెరిగిపోతోంది.
బెంగళూరు :
దేశంలోని దక్షిణాదిలో ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో గడిచిన కొన్నేళ్లలో జీవన వ్యయం భారీగా పెరిగి పోయింది. ఇళ్లకు అద్దెలు, ట్రాన్స్ పోర్ట్, ఫుడ్ ఎక్స్‌పెండేచర్, అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రాంతాలైన వైట్‌ఫీల్డ్, కోరమంగళలలో లైఫ్ స్టైల్, లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి.
చెన్నై :
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చెన్నైలో ఇంటి నిర్వహణ ఖర్చులు, జీవన సౌకర్యాలు సాధారణంగానే ఎక్కువగా ఉన్నాయి. ఇది వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ఉండటం వల్ల లివింగ్ కాస్ట్ ఎక్కువవుతోంది.
హైదరాబాద్ :
ఐటీ, ఫార్మా, ఫ్యూచర్ టెక్ రంగాలకు సెంటర్ పాయింట్‌గా మారుతోన్న హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం గత కొన్నేళ్లలో భారీగా పెరిగి పోయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి.
పూణే :
ఎడ్యుకేషన్, ఐటీ, ప్రొడక్టివిటీ రంగాలకు కేంద్రంగా ఉన్న పూణే నగరంలో జీవన వ్యయం క్రమంగా పెరుగుతోంది. అక్కడ ఇంటి అద్దెలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, జీవన శైలి ఖర్చులు గణనీయంగా పెరిగి పోతున్నాయి.
కోల్‌కతా :
తూర్పు భారతదేశంలో ప్రధాన నగరంగా ఉన్న కోల్‌కతాలో జీవన వ్యయం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొంత తక్కువ అయినప్పటికీ, ఇటీవలి అభివృద్ధి వల్ల ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న జీవన ప్రమాణాలు, జీవన వ్యయాలతో పోలిస్తే కోల్ కతా లో లివింగ్ కాస్ట్ ఎక్కువగానే ఉంటోంది.