32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ఏసియా కప్ షెడ్యూల్.. దాయాది పోరుకు ఫుల్‌ డిమాండ్

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అంటే అది మాములుగా ఉండదు. ఇరు దేశాల్లోని క్రికెట్‌ అభిమానులతో సహా.. అనేక మంది టీవీలకు అతుక్కుపోతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లెటెస్ట్‌గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా అక్కడి స్టేడియం నిండిపోగా.. ఇక టీవీలకు అతుక్కుపోయారు అభిమానులు. వ్యూస్ పరంగా ఓ కొత్త రికార్డ్ సృష్టించింది ఈ మ్యాచ్. అందుకే దాయాది పోరు కోసం బ్రాడ్‌కాస్టర్లు కూడా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ మ్యాచ్‌తో ఈ ఏడాది దాయాది పోరు ముగిసిందనుకుంటే మీరు పొరపడినట్టే.. ఎందుకంటే మరో మూడు మ్యాచ్‌ల్లో తలపడే అవకాశం ఉంది.

ఏసియా కప్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. మొత్తం 8 టీమ్స్‌ తలపడనున్నాయి. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండటంతో.. అదే ఫార్మాట్‌లో ఈ గేమ్‌ను ఆడే అవకాశం ఉంది. గ్రూప్‌ స్టేజ్‌లో ఒకసారి.. రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి.. అక్కడ కూడా మొదటి, రెండో స్థానాల్లో నిలిస్తే.. ఫైనల్స్‌లో మరోసారి ఢీకొనే అవకాశం ఉంది.

1984 నుంచి ఏసియా కప్‌ను నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు ఏడుసార్లు విజయం సాధించింది ఇండియా. మొత్తం 8 టీమ్‌లు.. 19 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక ఏసియా కప్‌కు దుబాయ్ లేదా శ్రీలంక వేదిక కానున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి సెప్టెంబర్‌ నాలుగో వారం వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

అయితే ఇక్కడ ఓ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. రోహిత్, విరాట్ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో వీరు ఈ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఓమన్, యూఏఈలు కూడా ఈసారి ఏసియా కప్‌కు అర్హత సాధించాయి.

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరగాలని అభిమానులు ఎలా అయితే కోరుకుంటున్నారో.. అంతకుమించి బ్రాడ్‌కాస్టర్లు కూడా కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ వినోదంతో పాటు.. వేల కోట్లలో వ్యాపారం జరిగేందుకు కారణమవుతుంది. అందుకే ఎక్కువ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com