ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబు
రేపు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ, నాలుగవ సెషన్ రెండవ సమావేశాల ఏర్పాట్లను సభాపతి గడ్డం ప్రసాద్, శాసనసభా వ్యవహారల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు ఆదివారం పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని శాసనసభ సిబ్బందికి సూచించిన సభాపతి ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విదంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులును సభాపతి ప్రసాద్ కుమార్ ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర డిజిపి, పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి శాసనసభ సమావేశాలపై చర్చించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ప్రత్యేకించి దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సోమారం జరగనున్న శాసనసభ సమావేశాల్లో సభ్యులు సంతాపం ప్రకటించనున్నారు.