32.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

బెల్లీ ల్యాండింగ్ అంటే..

కొరియాలో విమాన ప్రమాదం ఘటనలో ఏం జరిగింది?

దక్షిణకొరియాలో మౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ చివరి నిమిషంలో విమానం బెల్లీ ల్యాండింగ్ కు ప్రయత్నించడం అది విఫలం కావడం వల్లనే విమానం మంటల్లో దగ్ధమైందని విమాన యాన ఇంజనీర్లు అంటున్నారు. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ నుంచి కొరియాలోని మౌన్ కు బయల్దేరిన విమానం కుప్పకూలడంతో 92 మంది మరణించినట్లు సమాచారం.

బెల్లీ ల్యాండింగ్ అంటే…

విమానంలో లోపాలు తలెత్తినప్పుడు క్రాష్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తారు అదీ గేర్లు పనిచేస్తే.. ఒక వేళ అదీ ఫెయిల్ అయితే చివరిగా చేసే ప్రయత్నం బెల్లీ ల్యాండింగ్ . విమాన పైలట్ల పరిభాషలో దీనిని అలా అంటారు. గేర్లు పనిచేయనప్పుడే ఇలా చేస్తారు. అయితే గేర్లు ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం పక్షీ విమానాన్ని ఢీకొట్టి ఉంటుందని దాంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని టైర్లు తెరుచుకోలేదని అధికారులు అంటున్నారు. దాంతో విమానం పొట్ట (బెల్లీ) భాగం నేరుగా నేలను చాలా వేగంతో తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు అంటున్నారు. మామూలుగా అయితే విమానం ల్యాండ్ అవుతుందని గ్రౌండ్ స్టాఫ్ కు సమాచారముంటుంది. విమానం ల్యాండ్ అయ్యే ముందు ఎత్తును తగ్గించుకుంటూ కిందకు వస్తుంది. అది క్రమంగా కిందకు దిగి రన్ వే పైకి చేరుకునే సరికే చక్రాలు నేలపై ఆని కొంత దూరం విమానం ప్రయాణం చేసి ఆగుతుంది. ఇది సాధారణంగా జరిగే లాండింగ్. బెల్లీ ల్యాండింగ్ లో చక్రాలు లేకుండా విమానం నేరుగా నేలను తాకేస్తుంది. అయితే పైలట్ చివరి నిమిషంలో మాత్రమే ఈ సాహసం చేస్తాడు. దీనికి కూడా చాలా నైపుణ్యం అవసరం.. ఎంతో అనుభవజ్నులైన పైలట్లు మాత్రమే దీనిని చేయగలరు. విమానం గేర్ ఫెయిలయి టైర్లు తెరుచుకోని పక్షంలో పైలట్ రన్ వే పై నేరుగా దించుతాడు. అయితే ల్యాండింగ్ అయ్యే టైముకి ఇంధనాన్ని అత్యంత వేగంగా మండించేస్తూ ఖాళీ చేసేయాలి. ల్యాండింగ్, విమానంలో ఇంధనం పూర్తవడం రెండూ ఒకే సారి ఏకకాలంలో జరిగిపోవాలి.. విమానం నేలను ఢీకొన్నప్పుడు ఇంధనం అంటుకుని మంటలు రేగకుండా ఉండేందుకు అలా చేస్తారు. అయితే ఇక్కడ పైలట్ విమానం స్పీడును నియంత్రించలేకపోవడం ల్యాండింగ్ టైమ్ లాస్ట్ పాయింట్ అడ్జస్ట్ మెంట్స్ చూసుకోలేకపోవడంతో అది నేలను తాకే సరికే రన్ వేను దాటేసి చాలా ముందుకు వచ్చేసింది. దాని వల్ల ఎదురుగా కాంపౌండ్ గోడను ఢీకొని నేలపై పడీ పడగానే ఒక్కసారిగా మంటలు భగ్గుమన్నాయి. అంతమంది మరణానికి కారణమయ్యాయి. అసలు బెల్లీ ల్యాండింగ్ అనేది పైలట్ చివరి ఆప్షన్.ఇక్కడ పైలట్ లో ఆ నేర్పరి తనం లోపించిందా? ఏం జరిగిందన్నది ఇంకా తెలియలేదు. ఇటీవల కజకిస్థాన్ లో కూడా అజెర్ బైజాన్ విమానం ఇలాగే ల్యాండింగ్ టైములో పక్షి ఢీకొందని కుప్పకూలిందనే వార్తలొచ్చాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com