చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నంబర్ వన్ మాఫీయాగా మారారని పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని విమర్వించారు. పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన వాళ్లను కూడా బెదిరింపులకు గురిచేసి.. వసూళ్లకు పాల్పడి తరిమేశాడన్నారు. జిల్లాలోని అటవీభూములు, ఆలయ భూములు, రెవెన్యూ భూములు వేటినీ వదల్లేదని, అన్నీ కొల్లగొట్టాడని చల్లా రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తాను ఎన్నో చేశానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని.. గడిచిన 30 యేళ్లుగా కాంట్రాక్టులతో సంపాదించిన ఆస్తులెన్ని? గత నాలుగేళ్లలోనే పెరిగిన ఆస్తులెన్ని? లెక్కచెబుతావా? అని ప్రశ్నించారు. తన పబ్బం గడుపుకునేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని ఆరోపించారు. తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబును విమర్శించే హక్కు పెద్దిరెడ్డికి లేదన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాజకీయ సన్యాసం తీసుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి పాల్గొన్నారు.
- Advertisement with us -