34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

డాలర్ ని కాదంటే చుక్కలు చూపిస్తా… ట్రంప్

  • బ్రిక్స్ దేశాలకు మరో సారి ట్రంప్‌ వార్నింగ్‌
  • డాలర్ కాదంటే వంద శాతం టారిఫ్‌ లు తప్పవు
  • అమెరికా డాలర్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో స్థిరంగా ఉంది
  • కాదనుకుంటే పీల్చిపిప్పి చేసే మరో దేశానికి పొండి
  • ప్రత్యామ్నాయ కరెన్సీపై కొన్నాళ్లుగా బ్రిక్స్ దేశాల చర్చలు
  • అమెరికాతో సై అంటే సై అంటున్న పుతిన్

డాలర్ కాకుండా మరే కరెన్సీని మారకంగా వినియోగించినా వంద శాతం టారిఫ్స్ విధించడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు డోనాల్డ్ ట్రంప్‌. బ్రిక్స్ దేశాలన్నీ తప్పనిసరిగా డాలర్ నే కరెన్సీ మారకంగా వినియోగించాలని పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారాయన.

వంద శాతం వడ్డింపులు ఖాయం..

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్‌ స్ట్రాటజిస్టు అయిన ట్రంప్‌ బ్రిక్స్ దేశాలన్నీ మున్ముందు కరెన్సీ మారకాన్ని మారిస్తే సహించేది లేదని అమెరికా లాంటి అద్భుతమైన ఆర్ధిక వ్యవస్థతో వాణిజ్య బంధాలు ఏర్పరచుకుంటే వారికే మంచిదని సూచిస్తున్నారు. బ్రిక్స్ దేశాలు మరో అంతర్జాతీయ కరెన్సీ మారకాన్ని వినియోగం లోకి తేవాలని ట్రై చేస్తున్నారని అన్నీ గమనిస్తున్నామని, కొత్త కరెన్సీ సృష్టికానీ, మరో దేశం కరెన్సీని వాడకంలోకి తేవడం గానీ చేస్తే ఇక 100 శాతం టారిఫ్ లకు సిద్ధంగా ఉండండి అంటూ వార్నింగ్‌ ఇచ్చేశారు. అంతర్జాతీయ మారక ద్రవ్యంగా డాలర్ కొనసాగడం ఖాయమని ఇష్టం లేని వారు పీల్చి పిప్పి చేసే మరో దేశానికి పోవచ్చని పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. అమెరికా డాలర్ హవా అంతర్జాతీయంగా అప్రతిహతంగా  కొనసాగుతోందని, ఎవరైనా టారిఫ్‌ లు భరించడానికి సిద్ధమైతే ఇక అమెరికాతో వారికి శాశ్వత సంబంధాలు తెగిపోతాయని బెదిరించారు.

వాస్తవానికి అమెరికా ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ట్రంప్‌ ఈ బెదిరింపులను కంటిన్యుయస్ గా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పునరుద్ఘాటించడం అంటే తన ధోరణిలో, వైఖరిలో ఇసుమంతైనా మార్పు లేదని, అమెరికా ప్రయోజనాల పట్ల తన కమిట్‌ మెంట్‌ అలాగే ఉందనీ స్పష్టం చేయడం. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం కొనసాగేందుకు రక్షణ చర్యలు ఆయన మొదలు పెట్టేశారు.

మరోవైపు బ్రిక్స్ దేశాలు అమెరికా పెత్తనాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ కరెన్సీని వాడుకలోకి తెచ్చే అంశాలను ప్రతీసారి చర్చిస్తూనే ఉన్నాయి. 2023 బ్రిక్స్ సదస్సులోనే ఈ చర్చలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే  దేశాల మధ్య ఒప్పందాలు జరిగి జాతీయ కరెన్సీల వాడకంలో బ్యాంకుల మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com