26.7 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

స్వచ్ఛందంగా ఆస్తుల వెల్లడికి సుప్రీం జడ్జిల నిర్ణయం

  • సీజేఐ ముందుంచేందుకు 34 మంది సుముఖం
  • సుప్రీం కోర్టు అధికారిక వెబ్ సైట్ లో వివరాలు
  • పారదర్శకత కోసం జడ్జిల స్వచ్ఛంద నిర్ణయం
  • సర్వీస్ లో ఉండగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినా ఆస్తుల వెల్లడి
  • తన ఆస్తులు వెల్లడించిన ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా
  • 2009లోనే ప్రతిపాదనలు.. సీరియస్ గా పట్టించుకోని జడ్జిలు
  • కేరళలో ఇద్దరు తప్ప అందరు జడ్జిల ఆస్తుల వెల్లడి
  • తన ఆస్తులను బహిర్గతం చేసిన మరో సీజేఐ డి.వై. చంద్రచూడ్‌

సుప్రీం కోర్టు జడ్జిలు తమ తమ ఆస్తులను ప్రజల ముందుంచేందుకు ముందుకొచ్చారు.ప్రజా జీవితంలో పారదర్శకత కోసం తమ ఆస్తులు వెల్లడించేందుకు సిద్దమేనని గతంలోనే ప్రకటించినా తాజాగా జడ్జిలు పదవి స్వీకరించేముందు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ముందు తమ ఆస్తుల డిక్లరేషన్ ను సమర్పించేందుకు అంగీకరించారు. వీరితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్‌ ఇండియా కూడా తమ పదవిని స్వీకరించే ముందు తమ ఆస్తులను డిక్లరేషన్ రూపంలో కోర్టు అధికారిక వెబ్ సైట్ లో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఇది కేవలం స్వచ్ఛందంగా మాత్రమే అమలవుతుంది. అంటే వారికి ఆమోదయోగ్యమైతేనే వెల్లడించవచ్చు తప్ప నిర్బంధంగా కాదు. ఇప్పటి వరకూ 34 మంది జడ్జిలు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా సైతం తమ ఆస్తులను స్వచ్ఛందంగా వెబ్ సైట్ లో పెట్టారు. ఇకపై జడ్జిలంతా పదవి స్వీకారానికి ముందే తమ ఆస్తుల డిక్లరేషన్ ను అధికారిక వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అలా ఇష్టపడని పక్షంలో వారు పదవిలో ఉండగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడైనా తమ ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒకసారి వెల్లడిస్తారు. అలహాబాద్‌ హై కోర్టు జడ్జి జస్టిస్ వర్మ ఇంట్లో సగం కాలిన నోట్ల కట్టలు వెలుగు చూసిన ఉదంతం వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిందే.

13 % మంది మాత్రమే ఆస్తుల వెల్లడి

దేశవ్యాప్తంగా 25 హై కోర్టులలో మొత్తం 749 మంది జడ్జిలు ఉండగా కేవలం 98 మంది మాత్రమే ఇప్పటి వరకూ తమ ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. ఇది మొత్తం జడ్జిల సంఖ్యలో 13 శాతం మాత్రమే. అందరికన్నా కేరళ హైకోర్టు టాప్ లో ఉంది. అక్కడ39 మంది జడ్జిలుండగా 37 మంది తమ ఆస్తుల వివరాలను వెబ్ సైట్ లో పెట్టారు. పంజాబ్, హర్యానా హై కోర్టులో 35 మంది జడ్జీలుండగా అందుల 31 మంది తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు.

2009లోనే ప్రతిపాదనలు

2009 సెప్టెంబర్ లోనే జడ్జిల ఆస్తుల వెల్లడి ప్రతిపాదన ముందుకొచ్చినా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఇప్పటికీ జడ్జిలు వెల్లడించిన వివరాలేవీ ప్రజలకు తెలియవు. కేవలం సీజేఐ కి మాత్రమే తెలుస్తాయి. 2018 మార్చి తర్వాత ఈ ఊసే ఈ పద్ధతికే మంగళం పాడారు.2022లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ మోడీ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ఐఏఎస్ అధికారుల లాగా జడ్జిలు కూడా తమ ఆస్తులను వెల్లడించడం చట్ట బద్ధం చేయాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com