26.7 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

సునీతను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

  • స్ట్రెచర్ పై పడుకుని రిహాబిలిటేషన్ సెంటర్ కు
  • బాగా అలసిపోయి కనిపించిన సునీత
  • శారీరక, మానసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  • శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని సమస్యలు
  • ఎత్తు పెరిగి, ఎముకలు గుల్లబారి నడవలేని స్థితి
  • కణజాలం వేగంగా నశించి కరిగిపోయే కండ
  • తరుగుతున్న కండకు సమాంతరంగా పెరగని కొత్త కండరం

అంతరిక్షం నుంచి భూమికి సేఫ్‌గా ల్యాండ్ అయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 286 రోజులు మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఉన్నసునీత చాలా ఆరోగ్యాన్ని కోల్పోయారు. స్పేస్ ఎక్స్ మిషన్ నుంచి బయటకు దొర్లినట్లు జారుకుంటూ వచ్చిన ఈ జంటను వెంటనే అక్కడున్న సిబ్బంది పట్టుకుని స్ట్రెచర్ పై పడుకో బెట్టారు. అందరికీ చేతులూపుతూ అభినందనలు తెలిపిన సునీత స్ట్రెచర్ పై నవ్వుతూనే పడుకుని అందరినీ విష్ చేశారు. సుదీర్గ సమయం పాటు అంతరిక్షంలో గడపడం ఆ తర్వాత స్పేస్ ట్రావెల్‌తో ఆమె మరింత నీరస పడ్డారు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉన్న సునీత బాగా డస్సిపోయారు.అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు.

ఏం జరగనుంది?

ఆస్ట్రోనాట్లిద్దరూ భూ వాతావరణానికి అలవాటు పడటమే ఇప్పుడు అతిపెద్ద సమస్య. కొంత కాలం పాటు గాలిలో తేలిపోవడం అలవాటైన వారు ఇప్పుడు అందరిలా భూమిపై నడవ లేరు. సడెన్ గా భూమ్యాకర్షణకు లోనవడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారిని అందుకే కొన్నాళ్లు రిహాబిలిటేషన్ లో ఉంచుతారు. నలుగురితోనూ కలసి ఉండలేరు.పెద్ద పెద్ద గుంపులను, ఎక్కువ మంది జనాలను భరించలేరు. యాంగ్జైటీ, ఆందోళన, నిద్ర లేమి వేధిస్తాయి. సరైన ట్రీట్‌ మెంట్‌ దొరకక పోతే కొన్ని సమస్యలు శాశ్వతంగా ఉండిపోతాయి కూడా.

ఎత్తు పెరిగిపోయి, ఎముకలు గుల్లబారి

అంతరిక్షంలో మైక్రోగ్రావిటీలో గడిపిన వారు భూమిపై ల్యాండ్‌ అయితే కాళ్లను భూమిపై ఆన్చలేరు. అసలు నిలబడలేరు. నడక రాదు. ఆపై కండరాలు, ఎముకలు విపరీతంగా నొప్పి పెడతాయి.పైగాకండరాలు అచేతన స్థితిలో ఉంటాయి. చిన్న వస్తువును సైతం పట్టుకోలేరు. గ్రిప్ అస్సలు ఉండదు.
అంతరిక్షంలో గ్రావిటీ వల్ల వెన్ను సాగిపోతుంది. కాబట్టి సడెన్ గా ఎత్తు పెరుగుతారు. మరో వైపు కణజాల నిర్మాణం చాలా చాలా స్లోగా సాగుతుంది. ఇది చాలదన్నట్లు ఎముకలకు నష్టం కలిగించే కణాలు మాత్రం వేగంగా పెరిగిపోతుంటాయి. దీంతో ఎముకలు వేగంగా గుల్లబారిపోతుంటాయి.అంతరిక్షంలో భూమ్యాకర్షణ ఉండదు కాబట్టి కండరాలు బలహీనమవుతాయి. భూమిపై మళ్లీ ఆకర్షణ శక్తి లాగుతుంటుంది ఆ పెయిన్ ను తట్టుకోవడం కష్టం. అంతరిక్షంలో ఉన్నప్పుడు బరువును మోసే ఎముకలు మరింత సున్నితంగా, చిన్న దెబ్బకే విరిగిపోయేలా అయిపోతాయి.కాళ్లలో ఎముకలు, కండరాలు దెబ్బ తినడం వల్ల బేబీ ఫీట్‌ లా మారిపోతాయి. కాళ్ల కింద కండ కరిగిపోవడంతో కాలు కింద పెట్టలేక పోవడం సహజం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com