భట్టివిక్రమార్క సుదీర్ఘ బడ్టెట్ ప్రసంగం విన్న తరువాత మాకు అర్ధమైంది ఏంటంటే… కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు గోవిందో గోవింద అని అర్ధమయ్యిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈబడ్జెట్ ద్వారా ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ సర్కార్ పాతర వేసిందన్నారు. కాంగ్రెస్ వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని ఆ పార్టీ మొదటి ప్రాధాన్యత మూసీ లూటిఫికేషన్ తో ఢిల్లీకి మూటలు పంపడమే అని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అధ్వన్న నగరంగా మార్చారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందు గోళీలు కూడా ఇవ్వలేని దుస్ధితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి బడ్జెట్ లో ఒక్క మాట కూడా చెప్పలేదని, పెండింగ్ లో ఉన్న పీఆర్‌సీ, డీఏ బకాయిల గురించి బడ్జెట్ లో ప్రస్తావించలదేని కేటీఆర్ ఆరోపించారు. దళిత గిరిజన సోదరులను మోసం చేశారని, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ఒక్క మాట చెప్పలేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కాగితాలు ఇస్తోందని కేటీఆర్ విమర్శించారు.