39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పులు : స్వామి బోధమయానంద

వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దామని చెప్పారు.

హైదరాబాద్ దోమలగూడ లోని రామకృష్ణ మఠంలో సంస్కార్ వేసవి శిబిరం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రామకృష్ణ మఠం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు, యువకులు జాతి నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని స్వామి బోధమయానంద చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిమ్స్ హాస్పిటల్ సిఎండి భాస్కరరావు మాట్లాడుతూ.. జీవితంలో క్రమశిక్షణకు గల ప్రాధాన్యతను వివరించారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి విలువలు నేర్చుకుంటారని చెప్పారు. విద్య ద్వారా జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవచ్చోఆయన వివరించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం వాలంటీర్లు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com