34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

అమెరికాలో హఠాత్తుగా పెరిగిన సిజేరియన్ కేసులు

  • ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తో ఇండియన్లలో వణుకు
  • డ్యూడేట్‌ కన్నా ముందే డెలివరీ చేసేయాలని ఒత్తిడి
  • డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్న గర్భిణీలు
  • ఫిబ్రవరి 20 లోగా డెలివరీల కోసం క్యూ
  • ఆ డేట్‌ దాటితే సిటిజన్‌ షిప్‌ రాదని భయం
  • ట్రంప్‌ ఆదేశాలతో లక్షల్లో భారతీయులు, మెక్సికన్లకు దెబ్బ

అమెరికాలో ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీ భారతీయుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సోమవారం ఆయన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ మీద ఇలా సంతకం చేశారో లేదో సిజేరియన్ కేసులు హఠాత్తుగా పెరిగిపోయాయి. అక్కడ డెలివరీ కోసం వెళ్లిన ఇండియన్‌ గర్భిణీ స్త్రీలందరూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తమకు సిజేరియన్ చేసేసి బిడ్డను డెలివరీ చేసేయమని ఒత్తిడి పెంచుతున్నారు. అందరూ ఫిబ్రవరి 20 లోగా డెలివరీ అయిపోవాలంటూ డాక్టర్లను వేడుకుంటున్నారు. ఫిబ్రవరి 20 తర్వాత కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ వస్తే అక్కడ డెలివరీ జరిగినా సిటిజన్‌ షిప్ ఇక రాదు. అందుకని భారతీయులు, ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో క్లినిక్కుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్నటి వరకూ అమెరికాలో బర్త్ టూరిజం బాగా ప్రమోట్‌ అయ్యేది. అక్కడి సిటిజన్‌ షిప్‌ కోసం  డెలివరీలకు అక్కడకు వెళ్లేవారు.

రోజుకు 15 నుంచి 20 కేసులు

న్యూ జెర్సీలోని డాక్టర్ రోమా కథనం ప్రకారం మెజారిటీ గర్భిణీ స్త్రీలు ఎనిమిదో నెల లేదా తొమ్మిదవ నెలలో ఉండగానే సిజేరియన్లకు వచ్చేస్తున్నారు. మరీ ఏడునెలల గర్భిణీ ఒకామె తన భర్తతో కలసి వచ్చి ప్రిటెర్మ్ డెలివరీ చేయాలంటూ ఒక రిక్వెస్ట్ ఫారం ఇచ్చింది. ఆమెకు మార్చిలో డెలివరీ అవ్వాల్సి ఉండగా ఇప్పుడే ఆమె సిజేరియన్‌ కు సిద్ధపడుతోంది. టెక్సాస్‌ లో ఉన్న మరో ఇండియన్ లేడీ డాక్టర్ ఎస్‌ జి ముక్కామల  తన దగ్గరకు కూడా ఇలాటి కేసుల ఒత్తిడి పెరిగిందని రోజుకు పది, పదిహేను మంది ఇలా వస్తున్నారని, నెలలు నిండకుండా సిజేరియన్ వల్ల తలెత్తే సమస్యల గురించి వారికి వివరిస్తున్నానని ఆమె అన్నారు. నెలలు నిండకుడా సిజేరియన్ చేస్తే పుట్టిన పిల్లల్లో ఊపిరి తిత్తులు పూర్తిగా ఎదగవు. బరువు తక్కువగా పుడతారు. నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.వారికి ఫీడింగ్‌ ఇవ్వడం కూడా కష్టమే.

భారతీయులకు భయమెందుకు?

మనవాళ్లు అక్కడ చాలా మంది హెచ్ వన్ బీ వీసా, ఎల్‌ వన్ వీసాలపై పనిచేస్తున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న వీరంతా అక్కడే దశాబ్దాల పాటు కొనసాగి అక్కడే పిల్లలను కంటే వారికి సిటిజన్‌ షిప్‌ వస్తుందనే ఉద్దేశంతో అక్కడకు వెళ్లినవారు. ఇప్పుడు ట్రంప్‌ రాకతో వారి ఆశలన్నీ తల్లకిందులైపోయాయి. గ్రీన్ కార్డు హోల్డర్లకు ఈ ఇబ్బంది లేదు. వారు ఫిబ్రవరి 20 తర్వాత బిడ్డలను కన్నా వారికి సిటిజన్‌ షిప్‌ వస్తుంది. అయితే గ్రీన్ కార్డు కు చాంతాడంత క్యూ ఉంది. ఇప్పటికే పది లక్షల మంది ఇండియన్లు  గ్రీన్ కార్డు కోసం క్యూలో ఎదురు చూస్తున్న వారున్నారు. వర్క్ వీసాల మీద అక్కడున్న వారంతా తాజా నిర్ణయంతో వారంత వారుగా వెనక్కు వచ్చేయాలి. లేదా అక్కడే ఉండాలంటే వీసాకోసం అప్లయ్ చేయాలి. ఇక్కడ టెన్షన్ పడాల్సిన విషయమేమంటే ఇలా వెనక్కు రావాల్సిన వారంతా పిల్లలను అక్కడ ఉంచే వీలు లేదు. కాబట్టి వారితో సహా వెనక్కు వచ్చేయాల్సిందే. ట్రంప్‌ కూడా కుటుంబాలను విడదీయడం మా ఉద్దేశం కాదు. మీ అంత మీరుగా కుటుంబం మొత్తం వెళ్లిపోండి అని సూచిస్తున్నారు.

బర్త్ రైట్‌ సిటిజన్‌ షిప్‌ రద్దు సాధ్యమేనా?

సిటిజన్‌ షిప్‌ ను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లతో రీ డిఫైన్‌ చేయాలని ఇప్పటి వరకూ ఏ అధ్యక్షుడూ ప్రయత్నించలేదు. అసలు సిటిజన్‌ షిప్‌ ను వివాదంగా ఏ అధ్యక్షుడూ చూడలేదు. కానీ ట్రంప్‌ ఇప్పుడు దీనిని అమలు చేయాలని చూడటం చూస్తుంటే సుప్రీంకోర్టుతో ఘర్షణ పడటమే అవుతుంది. కోర్టు దీనిని అంగీకరిస్తే ఎవరు అమెరికన్, ఎవరు కాదు అన్నది నిర్వచించడంలో ఇదొక చారిత్రక తీర్పు అవుతుంది. ఒక వేళ బర్త్ రైట్‌ సిటిజన్‌ షిప్‌ ను కోర్టులు సమర్ధిస్తే ఇక రాజ్యాంగ సవరణ ద్వారానే ట్రంప్‌  దీని రద్దుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందడమే కాదు, రాష్ట్రాల చట్ట సభల్లో కనీసం ముప్పావువంతు రాష్ట్రాలు దీనిని సమర్ధించాల్సి ఉంటుంది. ఇది జరగడానికి కొన్నేళ్లు పట్టేస్తుంది. ఈ సంగతి ట్రంప్‌ కి కూడా తెలుసు. అయినా అదే పట్టుదలతో చేయాలనుకుంటే మాత్రం ట్రంప్‌ కి  సమయం సరిపోదు. మళ్లీ మళ్లీ గెలిచి దీని కోసం ప్రయత్నించాలి.1992 తర్వాత అమెరికా రాజ్యాంగానికి అసలు సవరణలే జరగలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com