విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బాక్సాఫీస్ సంభవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
వెంకటేష్.. -వండర్ ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్ గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.
అనిల్ ఈ సినిమాకి ప్రమోషన్స్ ఐడియా చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?
వెంకటేష్..-ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వుండేది. ఈ సినిమా జర్నీ ఒక మ్యాజికల్ గా అనిపించింది. అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇదంతా డివైన్ ఎనర్జీగా భావిస్తున్నాను.
..’సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఎలా అనిపించింది ?
అనిల్..-ఇంతమంది చూసి అప్రిషియేట్ చేయడం, రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించినదాని కంటే అద్భుతంగా రావడం చాలా ఆనందంగా వుంది. వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో రావడం చాలా హ్యాపీగా వుంది.
ఈ జర్నీలో అనిల్ లో ఎలాంటి మార్పులు గమనించారు ?
వెంకటేష్..-నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. మా మధ్య మంచి రేపో వుంది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే వుంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం, అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్ గా వుంటుంది. తను చాలా ఎనర్జిటిక్ గా వుంటారు.
ఐశ్వర్య రాజేష్ మీ కాంబినేషన్ లో సౌందర్యని గుర్తు చేశారనే కాంప్లిమెంట్స్ వచ్చాయి.. మీకు ఎలా అనిపించింది ?
వెంకటేష్..-ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు.
బుల్లి రాజు పాత్ర వైరల్ కావడం ఎలా అనిపించింది ?
అనిల్..-ఆ పాత్రని అందరూ చాలా పాజిటివ్ గా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని సీన్స్ వుంటే బావుండేదని అంటున్నారు. దీనికి కొనసాగింపుగా కథ చెప్పినప్పుడు తన పాత్ర చుట్టూ మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తాను.
230 కోట్లు పోస్టర్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేసివుంటే నెంబర్ ఇంకా బిగ్ గా వుండేది కదా ?
వెంకటేష్..-నేను ఎప్పుడూ ఏదీ అడగను. వచ్చింది తీసుకోవాలి. నిజానికి ఇది చాలా బోనస్. ఒక మంచి సినిమా హిట్ సినిమా ఇవ్వాలనుకున్నాం, ఆడియన్స్ సపోర్ట్ తో అది నెక్స్ట్ లెవల్ బ్లాక్ బస్టర్ కి వెళ్ళింది. ఇంతకంటే ఏం కావాలి.